TVK Vijay: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్..! సీఎంగా ప్రమాణస్వీకారంపై సందిగ్ధత..!
ప్రమాణస్వీకారానికి రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు విజయ్.
- Naveen
- Updated on- May 6, 2026 / 07:18 PM IST
TVK Vijay: తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ నెలకొంది. ప్రమాణస్వీకారానికి రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు విజయ్. అయితే, గవర్నర్ నుంచి విజయ్ కి ఇంకా పిలుపు రాలేదు. ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ముందుకు వచ్చినా.. అందుకు కావాల్సిన మెజార్టీపై గవర్నర్ కన్విన్స్ కాలేదని సమాచారం.
ఇవాళ గవర్నర్ ని కలిసిన విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య చూపించాలని విజయ్ ని అడిగారు గవర్నర్. ప్రమాణ స్వీకారం తర్వాత బలనిరూపణ చేస్తానని విజయ్ చెప్పారు. కాగా, విజయ్ చూపిన మెజార్టీ నెంబర్ పై గవర్నర్ కన్విన్స్ అయినట్లుగా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ ఇతర పార్టీల సపోర్ట్ కూడగట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే పార్టీ బలం 112కు చేరింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. తమిళనాడులో సీపీఐకి 2, సీపీఎంకి 2, ఐయూఎంఎల్ కు 2, వీసీకేకు 2 సీట్లు వచ్చాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేది లేదిన లెఫ్ట్ పార్టీ తేల్చి చెప్పాయి. అటు ఐయూఎంఎల్ సైతం మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే ఉంటామని సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ స్పష్టం చేశాయి. ఇక విజయ్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో వీసీకే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read: విజయ్ కి మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు.. TVKలో ఆ పార్టీ విలీనం..?
