Vijay TVK AIADMK Alliance : విజయ్ కి మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు.. TVKలో ఆ పార్టీ విలీనం..?
Tamil Nadu AIADMK MLAs Support TVK Alliance : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
Tamil nadu politics 30 AIADMK MLAs Support Vijay TVK Party For alliance
TVK AIADMK Alliance : ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి.. తమిళనాడు రాజకీయాల పైనే ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ.. ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించి మెజార్టీ మార్క్‌కు 10 అడుగుల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. టీవీకేకు ఎవరు మద్దతిస్తారు.. అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీవీకే విజయ్ కు మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం సారధ్యంలో 30 మంది టీవీకేకి మద్దతివ్వడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 సీట్లు గెలిచింది. అయితే ఇప్పుడు 30 మంది టీవీకేకు మద్దతివ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతులు అంటే 32 మంది చేరితే అన్నాడీఎంకే శాసనసభాపక్షం టీవీకేలో విలీనం అయినట్టే. ఆ దిశగా టీవీకే నేతలు పావులు కదుపుతున్నారు.
అన్నాడీఎంకేలో పళనిస్వామి తర్వాత షణ్ముగం కీలకపాత్ర పోషిస్తారు. వన్నియర్ కమ్యూనిటీకి చెందిన 15 మంది ఆయనకు సపోర్ట్ గా ఉన్నారు. దీంతోపాటు ఇద్దరు, ముగ్గురు ఉన్న మరో రెండు చిన్న గ్రూపులు ఉన్నాయి. అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి హవా తగ్గించాలంటే ఇలాంటి ఝలక్ ఏదన్నా ఇవ్వాలని కొందరి వాదన తెర పైకి వచ్చింది. ఈ క్రమంలో గత రాత్రి సుమారు 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగంతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. శాసనసభాపక్ష నేతగా షణ్ముగంను ఎన్నుకొని ఆయన సారధ్యంలో టీవీకేకు మద్దతివ్వాలని చర్చ జరుగుతోంది.
