కమల్ హాసన్ నాలుక కోసేయాలి : మంత్రి బాలాజీ

హిందూ టెర్రర్ పై మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మంత్రి కే.టీ.రాజేంద్ర బాలాజీ తప్పుబట్టారు.హిందువులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ నాలుక తెగిపడాల్సి ఉందని ఆయన అన్నారు.మైనార్టీల ఓట్లు పొందాలనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బాలాజీ అన్నారు.ఒక్క వ్యక్తి చేసిన పనికి మొత్తం కమ్యూనిటీనే తప్పుబట్టలేమని బాలాజీ అన్నారు.కమల్ పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని,ఆయన పార్టీని బ్యాన్ చేయాలని రాజేంద్ర బాలాజీ అన్నారు.

స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌. ఎన్నికల ప్రచారంలో భాగంగా..  అరవక్కురిచ్చిలో కమల్ హాసన్ మాట్లాడుతూ…స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అని,మహాత్మగాంధీని హత్య చేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ప్రారంభమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.