Vijay TVK MLAs: టీవీకే 107మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది..? రాజ్యాంగం ఏం చెబుతుంది..
Vijay TVK 107 MLAs Mass Resignation: డీఎంకే, అన్నాడీఎంకే కలిసి సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఆ రెండు పార్టీలు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనికితోడు అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి, గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.
- Harish Thanniru
- Updated on- May 8, 2026 / 03:22 PM IST
Tamil Nadu Politics 107 Mlas Resign From Tvk
Vijay TVK MLAs : తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవటంతో ప్రభుత్వం ఏర్పాటులో అనిశ్చితి నెలకొంది. అత్యధి స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్లు సాధించలేక పోయింది. కేవలం 108 స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అందులోనూ విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 107గా ఉంది.
Also Read : West Bengal Politics : పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమికి ‘సర్’ కారణమా? ఇదిగో లెక్కలు..
విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఆ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుంది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా అనే అంశం పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ తమిళ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే 107మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు విజయ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీవీకే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది..? రాజ్యాంగం ఏం చెబుతుంది ? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే టీవీకే నుంచి 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది.? రాజీనామా కంటే ముందు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంతకంటే ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి. 233మందిలో డీఎంకేకు 59, అన్నాడీఎంకేకు 47 సీట్లు ఉన్నాయి. అంటే రెండు పార్టీలు కలిపి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అయితే, కూటమివారిగా చూస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఒకవేళ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే అప్పుడు రాజ్యాంగ సంక్షోభం తలెత్తవచ్చు. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరవచ్చు. అదే పరిస్థితి తలెత్తితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఆ ప్రకారం.. రాష్ట్రపతి పాలన ఆరు నెలలు నుంచి ఏడాది పాటు కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆరు నెలలు లేదా ఏడాది తరువాత మళ్లీ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
అయితే, డీఎంకే, అన్నాడీఎంకే కలిసి సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఆ రెండు పార్టీలు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనికితోడు అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి, గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, డీఎంకే నుంచి కానీ, అన్నాడీఎంకే నుంచి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామనే ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.
