Tamil Nadu Politics : సీఎం కాదు.. అసలు అగ్నిపరీక్ష మరోటి ఉంది.. విజయ్‌కు రాజకీయ కష్టాలు మొదలైనట్లే.. .

Tamil Nadu Politics : టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతోంది. బొటాబోటీ మెజార్టీతోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చాలా కీలకమైన అంశంగా మారింది.

Tamil Nadu Politics

Tamil Nadu Politics : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118కి కాస్త దూరంలో నిలిచిపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు 108 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలో తమిళనాడులో పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎండీకేలతోపాటు పీఎంకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Also Read : Tamil Nadu Politics : మా ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తే మేం మద్దతిస్తాం.. విజయ్‌తో బేరసారాలు..

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే విజయ్‌కు ఫోన్ చేసి అభినందించారు. ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని విజయ్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఒకటి లేదా రెండు మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం విజయ్ ముందు పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో పీఎంకే ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవితోపాటు విజయ్ రాజీనామా చేసే అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో పోటీ చేసేందుకు తమ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సీపీఎం, సీపీఐలు కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నాయని సమాచారం. ఆయా పార్టీల ప్రతిపాదనలను దాటుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంశం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న చర్చ తమిళ రాజకీయాల్లో జరుగుతోంది.

టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతోంది. బొటాబోటీ మెజార్టీతోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చాలా కీలకమైన అంశంగా మారింది. ఒకవేళ స్పీకర్ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఒకటైతే విజయ్ కు ఇబ్బందికర పరిస్థితి తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బొటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని.. తమకు ఎదురయ్యే రాజకీయ సవాళ్లను అధిగమించడం విజయ్ కు పెద్ద సవాల్ గా మారొచ్చునని.. విజయ్ కు అసలు అగ్నిపరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.