Tamil Nadu Politics : మా ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తే మేం మద్దతిస్తాం.. విజయ్‌తో బేరసారాలు..
Tamil Nadu Politics : తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంకే నాయకుడు అన్బుమణితో టీవీకే పార్టీ ప్రతినిధులు చర్చలు జరపుతున్నారు. పీఎంకే మొత్తం నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధిష్టానం విజయ్ ముందు కీలక ప్రతిపాదనలు ఉంచింది. వాటికి ఒకే అంటే పొత్తుకు సిద్ధమని తెలిపింది.
TVK Vijay
Tamil Nadu Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ అభ్యర్థులు 108 స్థానాల్లో విజయం సాధించారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. దీంతో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా పది మంది ఎమ్మెల్యే అవసరం. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఐ, సీసీఎం పార్టీలతోపాటు పీఎంకే (Pattali Makkal Katchi) తో విజయ్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే, టీవీకేతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేందుకు పీఎంకే అధిష్టానం విజయ్ ముందు కీలక ప్రతిపాదన ఉంచిందట.
Also Read : TVK Vijay Alliance: విజయ్ కీలక నిర్ణయం.. ఆ పార్టీలతో కలవం.. పొత్తులపై క్లారిటీ.. కలిసొచ్చే పార్టీలివే..
తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్‌తో టీవీకే పార్టీ ప్రతినిధులు చర్చలు జరపుతున్నారు. పీఎంకే మొత్తం నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. పీఎంకే నాలుగు స్థానాలతోపాటు కాంగ్రెస్ పార్టీ ఐదు, సీపీఎం, సీపీఐ కలిపి నాలుగు, డీఎండీకే ఒక స్థానం కోసం టీఎంకే ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు తమ మద్దతును ప్రకటించింది. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సీపీఐ, సీపీఎం పార్టీలుకూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. అయితే, పీఎంకే మాత్రం టీవీకేతో చర్చలు జరుపుతోంది.
టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తమ మద్దతు ఇవ్వాలంటే తన సతీణి సౌమ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్బుమణి రామదాస్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. విజయ్ రాజీనామా చేయనున్న స్థానంలో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేవలం నాలుగు స్థానాల్లో విజయం సాధించిన పీఎంకే కీలక డిమాండ్లను విజయ్ ముందు ఉంచడంతో ఆయన పీఎంకే మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు టీవీకే వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు.. టీవీకే అధినేత విజయ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు వారాలపాటు సమయం ఇవ్వాళని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో పొత్తుల అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని, ఆ తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చునని విజయ్ ఆలోచన అని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
