DMK Manifesto: మహిళలకు నెలకు 2వేలు, రైతులకు ఉచితంగా పంపు సెట్లు- డీఎంకే మ్యానిఫెస్టో విడుదల

వృద్ధాప్య పెన్షన్లు 2వేలకు పెంచారు, యువతకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తామన్నారు. సీఎం హెల్త్ స్కీమ్ 10 లక్షలకు పెంచారు స్టాలిన్.

  • Published On : March 29, 2026 / 08:43 PM IST

 

DMK Manifesto: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా డీఎంకే మ్యానిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో ఆ పార్టీ చీఫ్, సీఎం స్టాలిన్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. మహిళలకు నెలకు 2వేలు ఇస్తామన్నారు స్టాలిన్. రైతులకు ఉచితంగా పంపు సెట్లు అందిస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో 8వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తామని తెలిపారు. 20 లక్షల మందికి ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు స్టాలిన్. ఇక వృద్ధాప్య పెన్షన్లు 2వేలకు పెంచారు, యువతకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తామన్నారు.

సీఎం హెల్త్ స్కీమ్ 10 లక్షలకు పెంచారు స్టాలిన్. ఇక అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలిపారు స్టాలిన్. తమిళ ప్రజలు ద్రవిడియన్ మోడల్ 2.O ను కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్న స్టాలిన్.. బీజేపీ తమిళ ప్రజలను కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మ్యానిఫెస్టోను ‘సూపర్‌స్టార్’ అని అభివర్ణించారు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్. మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించి వారి కోసంపలు సంక్షేమ చర్యలను ప్రకటించారాయన. చెన్నైలో జరిగిన మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. “డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో ఎల్లప్పుడూ ఒక ‘హీరో’, కానీ ఈసారి అది ‘సూపర్‌స్టార్'” అని స్టాలిన్ అన్నారు.

Also Read: తమిళనాడు ఎన్నికలు.. రెండు చోట్ల నుంచి విజయ్ పోటీ, కారు డ్రైవర్ కొడుక్కి టికెట్, అభ్యర్థుల ప్రకటన