తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. మధురై,
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. మధురై, తిరునల్వేలి, తిరువళ్లూరు, తూత్తుకుడి, విరుదునగర్, తేని, రామనాథపురం, వెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుత్తణిలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 8 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 30న సెలవు ప్రకటించింది. ముందు జాగ్రత్తగా పర్యాటక జలపాతాలను మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అరేబియా సముద్రంలో రెండో అల్పపీడనం ఏర్పడింది. సూపర్ సైక్లోన్ క్యార్ గా మారనుంది. అరేబియా గల్ఫ్ ఒమన్ తీరప్రాంతంలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడులో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
కన్యాకుమారి, తిరునల్వేవి, తూత్తుకుడి, రామనాథపురం, విరుదానగర్, మధురై, పుదుకొట్టై, తంజావూరు, తిరువూరు, నాగపట్నం, కడలూరు, విల్లుపురం, తిరువన్నామలై, కంచిపురం, వెల్లూరు, క్రిష్ణగిరి, ధర్మపురం, కనవిపురం, కనకిపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.