బలవంతంగా దళిత చిన్నారులతో మలమూత్రాలు మోయించిన అగ్రకులస్తులు

Dalit boys : అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులను తమిళనాడులో అరెస్టు చేశారు. వారి గ్రౌండ్ లో ఉన్న మలమూత్రాలను ఐదుగురు దళిత బాలురితో బలవంతంగా శుభ్రం చేయించారు. పెరంబలూర్ జిల్లాలోని సిరుకుదల్ గ్రామాంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రిపోర్టుల ప్రకారం.. 10నుంచి 15సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలు ఓపెన్ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన నిందితులు గ్రౌండ్ లో పడి ఉన్న మలమూత్రాలను క్లీన్ చేయాలని బలవంతం పెట్టారు. అగ్రకులానికి చెందిన వారంతా కలిసి వారికి ఆ బ్యాగులు మోసుకెళ్లమని పురమాయించారు.

నిందితులు అభినేశ్(20), సెల్వకుమార్(24), సిలాంబరసన్(22)లుగా గుర్తించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన చట్టం 1989ప్రకారం.. వారిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు.

ఈ ఘటన తెలిశాక గ్రామంలో ఆందోళన వాతావరణం మొదలైంది. విదుతలై సిరితైగల్ కచ్చి సభ్యులైన బాధిత పిల్లల కుటుంబాలు రోడ్ బ్లాక్ చేసి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యాక ఆందోళనను విరమించుకున్నారు.

పెరంబలూర్ సూపరింటెండెంట్ నిషా పరిబాన్ లోకల్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న పరిస్థితులు మా అదుపులోనే ఉన్నాయని ముందస్తు ఇన్వెస్టిగేషన్ కోసం దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.