Idli Amma: రూపాయి ఇడ్లీ అమ్మకు ఆనంద్ మహీంద్రా అందమైన గిఫ్ట్

రూపాయికే ఇడ్లీ అమ్ముతూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా పేరు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్‌కు..

Tamil Nadus Idli Amma Will Soon Have Her Own House1

Idli Amma: రూపాయికే ఇడ్లీ అమ్ముతూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా పేరు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహేంద్ర ఊహించని గిఫ్ట్‌ అందించారు. త్వరలోనే ఓ ఇంటికి యజమానిని చేయనున్నట్లు వెల్లడించారు. ఎప్పటిలాగే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ట్విటర్‌లో చెప్పారు.

త్వరలోనే కమలాథల్‌కు ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిందని ఆనంద్‌ మహేంద్ర తెలిపారు. రిజిష్ట్రేషన్‌ సకాలంలో పూర్తయ్యిందని.. దీనికి సహకరించిన రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న కమలాథల్‌ గురించి రెండేళ్ల కిందట సోషల్‌ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఆనంద్‌ మహేంద్ర.. కమలాథల్‌ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వ్యాపారం చేస్తానని ప్రకటించారు. కట్టెల పొయ్యితో వండుతుండడాన్ని చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్‌ ఇస్తానని ఆనంద్‌ హామీ ఇచ్చారు.

ఆమెకు ఇల్లు కానీ, హోటల్‌ కానీ నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో కమలాథల్‌కు కోయంబత్తూరులో ఓ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆనంద్‌ మహేంద్ర చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం కమలాథల్‌ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. మహేంద్ర లైఫ్‌ స్పేసెస్‌ ఆ ఇంటిని నిర్మించనుంది.