VK. Sasikala : ఏమీ కలిసి రావటంలేదట..అందుకే..పేరు మార్చుకోనున్న శశికళ..

తమిళనాడు దివంగత నేత..మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ పేరు మార్చుకోబోతున్నారు.

Tamilnadu Vk. Sasikala Sasikala Name Change

tamilnadu VK. Sasikala sasikala name change : తమిళనాడులో అమ్మా అంటూ ఆత్మీయంగా పిలుచుకునే మహానేత..తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మహిళా ముఖ్యమంత్రి..దివంగత నేత జయలలిత తరువాత అన్నాడీఎంకేని కైవసం చేసుకోవాలనుకున్నారు జయలలిత స్నేహితురాలిగా వెలుగులోకి వచ్చిన శశికళ.జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆమె నెచ్చెలి శశికళ అనూహ్య రీతితో జైలు పాలయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఎన్ని యత్నాలు చేసినా ఏమాత్రం ఫలించలేదు. జయలలిత జీవించి ఉండగా ఆ పార్టీలో చక్రం తిప్పి..జయలలిత వంటి మహానేతను కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్న శశికళకు నెచ్చెలి మరణం తరువాత ఏమాత్రం విలువలేకుండా పోయింది. అయినా పార్టీని కైవసం చేసుకుని మరోసారి తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నా శశికళ పాచికలు ఏమీ ఫలించలేదు. రాజకీయ నేతగా చక్రం తిప్పాలనుకున్న ఆమె కలలు ఫలించలేదు. అలా జయలలిత మరణం తరువాత ఆమె అన్ని విధాలుగా శశికళ విఫలమై జైలుపాలయ్యారు. కానీ జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లి వచ్చాక ఆమెకు పార్టీలో ఆశించిన స్థానం లభించలేదు.

Also read : Man eat sand: ఇసుక తిని బతికేస్తున్నాడు.. 40ఏళ్లుగా అతని ఆహారం ఇసుకే

శశికళ కుటుంబ సభ్యుల దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నందున వారి నియంత్రణలో ఉండాల్సిన పరిస్థితి శశికళకు ఏర్పడింది. ఆమెపై పలు కేసులు కూడా కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసులను ఎదుర్కొనేందుకు, ఆస్తులను కాపాడుకునేందుకు తన బంధువుల సాయం శశికళకు అవసరం. అంతే కాకుండా జయలలిత మాజీ సహాయకుడు పూంగుండ్రన్‌ను తనకు సహాయకుడిగా నియమించుకునేందుకు పిలవగా..అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇలా వరస వైఫల్యాలు జరుగుతుండటంతో కారణాల గురుంచి జ్యోతిష్యుడి దగ్గర సలహా అడిగారు. ఆమె జాతకాన్ని చూసిన జ్యోతిష్యుడు పేరు, ఇంటిని మార్చాలని సలహా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో అన్నింటా విఫలం అవుతున్న ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె పేరు మార్చుకోవాలని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం చూపించలేదు. దీంతో ఒంటరిగా మారిన శశికళ.. రాజకీయాల నుంచి తప్పుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించారు. పలు గుళ్లుగోపురాలను సందర్శించారు.

అయితే, మళ్లీ మనసు మారింది. మద్దతుదారులు తనను తిరిగి రాజకీయాల్లోకి రమ్మంటున్నారని, కాబట్టి మనసు మార్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఇన్ని చేస్తున్నా ఆమెకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు అండగా ఉన్న దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం ఆమె.. సోదరుడు దినకరన్, భర్త నటరాజన్ సోదరులు, వదిన ఇళవరసి వారసుల సూచన మేరకు శశికళ నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also read : Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

జయలలిత మాజీ సహాయకుడు పూంగుండ్రన్‌ను పిలిచి తనకు సహాయకుడిగా పనిచేయాలని శశికళ అడిగారని..దానికి ఆయన నిరాకరించారని కూడా సమాచారం. అనుకున్నదేదీ సవ్యంగా సాగకపోవడం, ప్రతీ దాంట్లోనూ ఆటంకాలు ఎదురవుతుండడంతో ఇక లాభం లేదని ఇటీవల శశికళ ఓ జ్యోతిష్యుడిని కలిసినట్టు తెలుస్తోంది. ఆమె జాతకాన్ని చూసిన ఆయన.. పేరుతోపాటు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూడా మార్చాలని సలహా ఇచ్చారని సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో శశికళ..తన పేరుతో పాటు జ్యోతిష్కుడు చెప్పినట్లుగా ఇంటిని కూడా మార్చాలని శశికళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.