Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.

Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

Cheetah

Cheetah: దేశంలో 70 ఏళ్లక్రితం అంతరించిన చిరుత (చీతా)లు మళ్లీ భారత్‌లో కనిపించబోతున్నాయి. ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇవి ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికా నుంచి వీటిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Diabetes: దేశంలో 150 శాతం పెరిగిన మధుమేహ బాధితులు

కొంతకాలంగా ఆఫ్రికాతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఆగష్టులో ఐదు లేదా ఆరు చిరుతలు దేశం వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో భాగంగా రాబోతున్న వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచుతారు. వీటి కోసం పార్కు పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుతల్ని తీసుకొచ్చే అంశానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునేందుకు నియమించిన భారత బృందం ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15న ఆఫ్రికా నిపుణుల బృందం కూడా భారత్ వస్తుంది. ఇక్కడ చిరుతల్ని సంరక్షించే కునో నేషనల్ పార్కను వాళ్లు సందర్శిస్తారు. వాటి కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ ఏర్పాట్లపై సంతృప్తి చెందితే చిరుతల్ని భారత్ పంపించేందుకు ఆఫ్రికా అంగీకరిస్తుంది. చిరుతల్ని సురక్షితంగా తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి కూడా కావాల్సి ఉంది. నిజానికి చిరుతలు ఎప్పుడో రావాలి. కానీ, కోవిడ్ కారణంగా సాధ్యపడలేదు. చిరుతల్ని గతంలో వేరే దేశానికి తరలించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, వేరే ఖండానికి తరలించబోతుండటం ఇదే మొదటిసారి.

Mexico: మెక్సికోలో కాల్పులు.. ఐదుగురు విద్యార్థులు మృతి

చిరుతల్ని వేటాడటం, నివాస ప్రాంతాలు కరువవ్వడం వంటి కారణాల వల్ల దేశంలో ఇవి అంతరించిపోయాయి. దేశంలో చివరగా మిగిలిన మూడు చిరుతల్ని మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ దియో అనే రాజు 1947లో వేటాడాడు. దీంతో చిరుతలు పూర్తిగా అంతరించాయి. తర్వాత 1952లో ఇవి అంతరించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆఫ్రికాలో ఉన్న చీతాల్ని దేశం తీసుకురావాలనే ప్రతిపాదన 2009లో వచ్చింది. అప్పట్నుంచి సాగుతున్న ఈ ప్రయత్నాలు ఇప్పుడు చివరి దశకు వచ్చాయి.