Teesta Setalvad Walks Out Of Jail
2002 Gujarat riots case: రెండు నెలల అనంతరం సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ జైలు నుంచి విముక్తి లభించింది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో అరెస్టై జైలు పాలైన ఈమె శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్ట్ అయిన నాటి నుంచి ఆమె బెయిల్ కోసం పోరాడుతున్నారు. అయితే ఆమెకు బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు ఒక మెలిక పెట్టింది. ఆమె తన పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతే కాకుండా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది.
ఇదే సమయంలో గుజరాత్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం ఒక సూచన చేసింది. తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువారం విచారణ సమయంలో బెయిల్‌కు అవకాశం లేని పొటా, ఉపా వంటి కేసులు సెతల్వాద్‌పై లేవని సుప్రీం తెలిపింది. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి వాజ్యాలు వేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు పెట్టి ఆమెను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.
Amit Shah at Kerala: ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి