Ayodhya : రామ మందిర గర్భగుడిలో ప్రవేశించిన వానరం.. హనుమంతుడే వచ్చాడంటూ.. ఆలయ ట్రస్ట్ ట్వీట్

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అరుదైన ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించిన వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఆలయ ట్రస్ట్ ట్వీట్ చేసింది.

Ayodhya

Ayodhya : అయోధ్య రామ మందిర గర్భగుడిలోకి వానరం ప్రవేశించింది. శ్రీరాముని ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లింది. వైరల్ అయిన ఈ ఘటనపై ఆలయ ట్రస్ట్ సైతం స్పందించింది.

Ram Mandir Darshan: అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. రెండోరోజూ బాలరాముడి దర్శనంకోసం బారులు.. వీడియోలు వైరల్

జనవరి 22న అయోధ్యలో బాలరాముని ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఐదులక్షల మందికి పైగా భక్తులు శ్రీరాముని దర్శించుకున్నారు.

Ayodhya Sri Ram Song : అయోధ్య శ్రీరామ్ స్పెషల్ సాంగ్ విన్నారా? అమెరికా NRI సమర్పణలో..

ఇదిలా ఉంటే ఆలయంలోకి వానరం ప్రవేశించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘పోలీసులు వానరం వైపు పరుగెత్తిన వెంటనే అది ఉత్తర ద్వారం వైపు పరుగులు తీసింది. గేటు మూసి ఉన్నందున అది తూర్పు వైపుకు జనం మధ్యలో నుండి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా బయటకు వెళ్లింది. శ్రీరాముని దర్శనం కోసం హనుమంతుడు స్వయంగా వచ్చినట్లు భద్రతా సిబ్బంది అంటున్నారు’ అనే శీర్షికతో పోస్టు చేసారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజంగానే హనుమంతుడు వచ్చారంటూ నెటిజన్లు స్పందించారు.