జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లాలో గ్రేనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం (అక్టోబర్ 5, 2019) డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన చోటు చేసుకుంది. గ్రేనెడ్ దాడిలో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో 12 ఏళ్ల బాలికతోపాటు ఓ జర్నలిస్టు, ఓ పోలీసు కూడా ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ గ్రనేడ్ విసిరినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. వారు అనుకున్న టార్గెట్ విఫలమవ్వడంతో పెను ముప్పు తప్పింది. గ్రనేడ్ రోడ్డు పక్కల పడటంతో అటువైపుగా వెళ్లే వారు గాయపడ్డారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని బద్రత బలగాలు చుట్టుముట్టాయి.
దాడి చేసిన ఉగ్రవాదుల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడి చేయడం ఇది రెండోసారి. అయితే గ్రేనేడ్ దాడి తమ పనేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.