Maharashtra: సీఎం సందర్శన అనంతరం బాలాసాహేబ్ థాకరే సమాధిని గోమూత్రంతో కడిగారు

మహారాష్ట్రలో శివసేన విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడిన అనంతరం నాటి నుంచి అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం ఒకరిపై మరొకరు కత్తి దూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. అంతే కాకుండా బాలాసాహేబ్ థాకరేకు అసలైన వారసత్వం తమదంటే తమదని చెప్పుకుంటున్నారు.

Maharashtra: ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వచ్చి వెళ్లిన అనంతరమే బాలాసాహేబ్ థాకరే సమాధిని గోమూత్రంతో శుభ్రం చేశారు ఉద్ధవ్ థాకరే వర్గీయులు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాలాసాహేబ్ థాకరే పదవ జయంతి సందర్భంగా బుధవారం ఆయన సమాధిని ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే సందర్శించి నివాళులు అర్పించారు. వాస్తవనాని బాలాసాహేబ్ థాకరే జయంతి గురువారం అయినప్పటికీ ప్రత్యర్థి శివసేన శిబిరంతో ఎలాంటి ఘర్షణ జరగకుండా ఉండేందుకు ఒకరోజు ముందుగానే థాకరే సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు షిండే.

సీఎం షిండే నివాళులు అర్పించి అలా బయటికి వెళ్లగానే, ఉద్ధవ్ శివసేన వర్గీయులు.. సమాధిపై గోమూత్రం, నీళ్లు చల్లి శుభ్రం చేశారు. అయితే ఉద్ధవ్ వర్గీయులు చేసిన పనిపై షిండే వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. థాకరేను ఒక వర్గానికి పరిమితం చేయాలని కొందరు భావిస్తున్నారని, ఆయనకు ఎవరైనా నివాళి అర్పించొచ్చని, అలా అందరిని అనుమతించినప్పుడే థాకరే ఖ్యాతి మరింత పెరుగుతందని అన్నారు.

మహారాష్ట్రలో శివసేన విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడిన అనంతరం నాటి నుంచి అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం ఒకరిపై మరొకరు కత్తి దూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. అంతే కాకుండా బాలాసాహేబ్ థాకరేకు అసలైన వారసత్వం తమదంటే తమదని చెప్పుకుంటున్నారు.

Veer Savarkar: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేస్తానంటున్న వీర్ సావర్కర్ మనవడు

ట్రెండింగ్ వార్తలు