×
Ad

Groom Dies Of Heart Attack : కల్యాణమండపంలో గుండెపోటుతో వరుడు మృతి

బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది.

  • Published On : March 4, 2023 / 12:38 PM IST

died

Groom Dies Of Heart Attack : బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది. ఇందర్వ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వధూవరులు దండలు మార్చుకున్న కొద్దిసేపటికే వరుడు సురేంద్ర పెళ్లి వేదికపై కుప్పకూలాడు. అతన్ని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. గుండె పోటుతో సురేంద్ర మరణించి ఉంటారని డాక్టర్లు పేర్కొన్నారు.

Bride Groom Died : పెళ్లైన మూడో రోజే.. గుండెపోటుతో వరుడు మృతి

కల్యాణమండపం దగ్గరకు రాగానే మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని వరుడు సురేంద్ర కోరినా ఎవరూ వినిపించుకోలేదని గ్రామస్తులు చెప్పారు. భారీ శబ్ధాలతో మ్యూజిక్ హోరెత్తించడంతోనే సురేంద్ర గుండెపోటుకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.