Bride Groom Died : పెళ్లైన మూడో రోజే.. గుండెపోటుతో వరుడు మృతి
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన మూడవ రోజే వరుడు మృతి చెందాడు. వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Bride Groom Died
Bride Groom Died : ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన మూడవ రోజే వరుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పాకాల మండలం కట్టకిందిపల్లికి చెందిన తులసి ప్రసాద్ కు శిరీష అనే యువతితో గత సోమవారం వివాహం జరిగింది.
మదనపల్లెలోని చంద్రశేఖర్ కాలనీలో తులసి ప్రసాద్ నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి అత్తగారింట్లో గుండెపోటుకు గురై తులసి ప్రసాద్ మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురైన తులసి ప్రసాద్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యంలోనే మృతి చెందాడు.
Suspicious Death : పెళ్లైన గంటల వ్యవధిలో వరుడు అనుమానాస్పద మృతి
అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.