Suspicious Death : పెళ్లైన గంటల వ్యవధిలో వరుడు అనుమానాస్పద మృతి

నంద్యాల జిల్లాలో పెళ్లైన 24 గంటల్లో వరుడు అనుమానాస్పదంగా మరణించటం సంచలనం రేపింది.

Suspicious Death : పెళ్లైన గంటల వ్యవధిలో వరుడు అనుమానాస్పద మృతి

Suspicious Death

Updated On : June 25, 2022 / 2:07 PM IST

Suspicious Death :  నంద్యాల జిల్లాలో పెళ్లైన 24 గంటల్లో వరుడు అనుమానాస్పదంగా మరణించటం సంచలనం రేపింది. జిల్లాలోని వెలుగోడు మండలంలోని బోయరేవుల గ్రామానికి చెందిన శివ కుమార్ అనే వ్యక్తికి, జూపాడు బంగ్లా మండలంలోని భాస్కరాపురానికి చెందిన శిరీష   అనే యువతితో  శుక్రవారం వివాహం అయ్యింది. రాత్రి బంధుమిత్రులతో  అంతా సంతోషంగా గడిపారు.

శనివారం తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్ళి వస్తానని చెప్పి  వరుడు శివకుమార్   బయటకు వెళ్లాడు. తెల్లారిన తర్వాత ఎంతసేపటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు శివకుమార్ కోసం గాలింపు చేపట్టారు. బోయరేవుల-మోత్కూరు గ్రామాల మధ్య శివకుమార్ పడి ఉండటాన్ని బంధువులు గుర్తించారు.

చలనం లేకుండా రోడ్డుపై పడి ఉన్న అతడిని వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.  శివకుమార్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.   గుర్తు తెలియని వాహానం ఢీకొట్టిందా? లేక ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  పెళ్లై 24 గంటల తిరగక ముందే వరుడు మరణించటంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read : squirrel : ఉడుత చేసిన పనికి 3,000 ఇళ్లకు కరెంట్ కట్..ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం