Divorce : భార్యను భరించలేను.. విడాకులు ఇప్పించండి – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అతి శుభ్రం భర్తకు కష్టాలు తెచ్చిపెట్టింది. భార్య అతి శుభ్రం భరించలేని భర్త విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
- kunduru Vinod
- Published On : December 5, 2021 / 09:51 AM IST
Divorce
Divorce : భార్య అతి శుభ్రం భర్తకు కష్టాలు తెచ్చిపెట్టింది. భార్య అతి శుభ్రం భరించలేని భర్త విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2009 పెళ్ళైన ఓ జంట బెంగుళూరు ఆర్టీ నగరలో కాపురం ఉంటుంది. అయితే అంతకు ముందు ఈ దంపతులు ఉద్యోగ నిమిత్తం లండన్ వెళ్లారు. కొంతకాలని బెంగళూరు తిరిగి వచ్చారు. అయితే భార్య కడిగిందే కడిగి.. తుడిసిందే తుడిసి భర్తకు చిరాకు తెప్పించేది.
చదవండి : Divorced Woman Ends Her Life : మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్య
దీంతో ఓ సారి కౌన్సెలింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాడు. అయినా ఆమెలో మార్పురాలేదు. ఉతికిన బట్టలే ఉతుకుతు.. తమ ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే నిరంతరం శుభ్రం కోసం పరితపించేది. పదే పదే అదే పనిగా భార్య శుభ్రం చేస్తుండటంతో ఆమె ప్రవర్తన తట్టుకోలేక విడాకులు కావాలని పోలీసులకు తెలిపాడు భర్త. అయితే ఈ జంటకు మరోసారి కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్దారించారు.
చదవండి : ChaySam Divorce : విడాకులపై స్పందించిన సమంత తండ్రి ‘మరోసారి ఆలోచించుకోమని సామ్‌కు చెప్పాను’
