ChaySam Divorce : విడాకులపై స్పందించిన సమంత తండ్రి ‘మరోసారి ఆలోచించుకోమని సామ్‌కు చెప్పాను’

సమంత - నాగచైతన్య విడాకులపై సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు స్పందించారు. ఈ విషయం తెలియగానే తన మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు.

ChaySam Divorce : విడాకులపై స్పందించిన సమంత తండ్రి ‘మరోసారి ఆలోచించుకోమని సామ్‌కు చెప్పాను’

Chaysam Divorce

Updated On : October 5, 2021 / 9:27 PM IST

ChaySam Divorce : సమంత – నాగచైతన్య విడాకులపై సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు స్పందించారు. ఈ విషయం తెలియగానే తన మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు. చై-సామ్ విడాకుల విషయం వినగానే కళ్ళ ముందు అంతా చీకటి కమ్ముకుందని పేర్కొన్నారు. ఈ విషయంపై సమంతను ఓ సారి ఆలోచించమని చెప్పినట్లు జొషెఫ్ వివరించారు. సమంత స్పృహ ఉండే ఈ నిర్ణయం తీసుకోని ఉంటుందని అన్నారు. త్వరలో పరిస్థితితులు చక్కబడతాయని ఆశిస్తున్నట్లు సమంత తండ్రి తెలిపారు. ఇక వీరి విడాకులపై చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. సంసారం గురించి సలహాలు సూచనలు చేశారు. ఇక తాజాగా నటి మాధవి లత కూడా చై – సామ్ డైవర్స్ పై స్పందించారు.

Read More : God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?

ఇక విడాకుల విషయం తెలిసిన వెంటనే నటుడు, నాగచైతన్య తండ్రి నాగార్జున కూడా స్పందించిన సంగతి తెలిసిందే. చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతూ-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. అంటూ ట్వీట్ చేశారు. కాగా గత కొద్దీ రోజులుగా వీరి విడాకుల వ్యవహారం తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది.

Read More : Tollywood Divorce List: కమల్ నుండి చై వరకు.. విడాకులు తీసుకున్న స్టార్స్!