Tollywood Divorce List: కమల్ నుండి చై వరకు.. విడాకులు తీసుకున్న స్టార్స్!

విడాకులంటే పెద్ద మ్యాటరేం కాదన్నట్లుగా మారిపోయింది మన సినీ పరిశ్రమలో. అందరూ అలానే ఉన్నారని అనలేం కానీ.. గొడవలు పడిన ఎక్కువ శాతం జంటలు చివరికి విడాకులే శరణ్యమని భావిస్తున్నారు.

Tollywood Divorce List: కమల్ నుండి చై వరకు.. విడాకులు తీసుకున్న స్టార్స్!

Tollywood Divorce List

Tollywood Divorce List: విడాకులంటే పెద్ద మ్యాటరేం కాదన్నట్లుగా మారిపోయింది మన సినీ పరిశ్రమలో. అందరూ అలానే ఉన్నారని అనలేం కానీ.. గొడవలు పడిన ఎక్కువ శాతం జంటలు చివరికి విడాకులే శరణ్యమని భావిస్తున్నారు. ఇది ఈనాటిదేం కాదు.. చాలా ఏళ్లుగా వస్తున్నదే. బయట సమాజంలో కూడా ఇదే తరహా భావన కనిపిస్తున్నా.. సినీ సెలబ్రిటీల మధ్య వ్యవహారం మాత్రం హైలెట్స్ అవుతున్నాయి. తాజాగా.. అక్కినేని నాగ చైతన్య – సమంతాల విడాకుల అంశంతో ఇప్పుడు మరోసారి సినిమా వాళ్ళలో విడాకులు తీసుకున్న వారిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా, విలక్షణ నటుడిగా పేరున్న కమల్ హాసన్ 1978లో 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకుని పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత సారికతో కలిసి జీవించి వివాహం చేసుకోగా ఇద్దరు కూతుళ్లు (శృతి హాసన్, అక్షర హాసన్) పుటిన తర్వాత 2002లో ఈ జంట విడాకుల కోసం దాఖలు చేసుకున్నారు. ఆ తర్వాత నటి గౌతమితో కూడా కొన్నాళ్ళు కమల్ సహజీవనం సాగించగా ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాడు.

Naga Chaitanya-Samantha: చైతూ సెలబ్రేషన్స్.. మరి సామ్ ఎక్కడ?

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకడైన నాగార్జున అక్కినేని 1984లో మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత 1990లో ఆమెకు విడాకులు ఇచ్చి అమలను ప్రేమ వివాహాం చేసుకున్నాడు. తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడైన పవన్ కల్యాణ్ తన మొదటి భార్య నందిని ఉండగానే నటి రేణు దేశాయ్ తో సహజీవనం చేయగా.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రేణును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రేణూదేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చి రష్యన్ నటి అన్నా లెజినోవాను మూడో వివాహాం చేసుకున్నాడు.

RGV: సామ్-చై విడాకులు.. వర్మ సెలబ్రేషన్స్!

అక్కినేని కుటుంబం నుండే వచ్చిన మరో హీరో సుమంత్‌ నటి కీర్తిరెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన రెండేళ్లలోనే వారు క‌లిసి ఉండలేక‌ విడాకులు తీసుకున్నారు. సుమంత్ ఇప్పటికీ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడు. ఇక డైలాగ్ కింగ్ మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్‌ కూడా పెళ్లి ప్రయాణంలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రణతి రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోగా కొనాళ్లపాటు కలిసి ఉన్న వీరు.. విభేదాల కారణంగా ఇటీవల విడిపోయారు.

ChaySam Break-UP: చైతూతో విడిపోయిన సమంతకు భరణం ఎంతంటే?

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ 1994లో నటి లలితా కుమారిని వివాహం చేసుకోగా.. వారికి ఇద్దరు కుమార్తెలు-మేఘనా, పూజ, ఒక కుమారుడు సిద్దూ ఉన్నారు. ఈ జంట 2009లో విడాకులు తీసుకోగా ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకోగా.. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం స్నేహకు సైతం శరత్‌ బాబు విడాకులిచ్చారు.

ChaySamBreakup: సినిమాలే ఇద్దరి మధ్య దూరం పెంచాయా?

మాజీ హీరోయిన్, తమిళ నటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకోగా అతనికి విడాకులిచ్చి రెండోసారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అతనికి కూడా విడాకులిచ్చి 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ గాయని సునీత ముందుగా కిరణ్ ను పెళ్లిచేసుకోగా వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు. ఇక, 2017లో పెళ్లి చేసుకున్న సమంతా-నాగచైతన్య కూడా విడిపోతున్నట్లుగా ప్రకటించేశారు.