king cobra
King Cobra Died After Biting Man : సాధారణంగా పాము కాటు వేస్తే మనిషి చనిపోతాడు. మనిషిని కాటు వేసిన పామే మరణించింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం కింగ్ కోబ్రా. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. అలాంటి విష సర్పం ఓ మనిషిని కాటు వేసి మృతి చెందింది. ఇదేంటి కింగ్ కోబ్రా మనిషిని కాటు వేసి మరణించడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజం.
ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషినగర్ జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. వైద్యుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది మృతి చెందిందని వివరించారు.
వైద్యులను నమ్మించేందుకు చనిపోయిన కింగ్ కోబ్రాను కవర్‌లో వేసి తన వెంట తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. ఈ ఘటనతో వైద్యులు ఆశ్చర్యపోయారు. సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు.