Viral Video: దీని దుంపతెగ..! పార్టీలోకి దూసుకొచ్చిన సింహం.. యువకుడు చెట్టెక్కినా వదల్లేదు..

ఒక్కోసారి సింహం, పులి లాంటి జంతువులు జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుంటాయి. గతంలో ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలుసైతం కోల్పోయారు. తాజాగా ఓ సింహం విద్యుత్ వెలుగుల్లో జరుగుతున్న పార్టీలోకి చొరబడింది. ఇంకేముంది ..

Viral Video: అటవీ ప్రాంతంలో, బహిరంగ ప్రదేశాల్లో అడవి జంతువులు వేటాడి వాటి ఆకలి తీర్చుకోవటం మనం పలు వీడియోల్లో చూస్తూనే ఉంటాం. సింహం అయితే తోటి జంతువులను వేటాడుతూ మిగిలిన భయకంపితులను చేస్తుంది. సింహాన్ని చూస్తే మనుషులుసైతం దాని దరిదాపుల్లోకి ఉండకుండా వెళ్లిపోతారు. ఒక్కోసారి సింహం, పులి లాంటి జంతువులు జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుంటాయి. గతంలో ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలుసైతం కోల్పోయారు. తాజాగా ఓ సింహం విద్యుత్ వెలుగుల్లో జరుగుతున్న పార్టీలోకి చొరబడింది. ఇంకేముంది అందరూ అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు.

Benz Car On Fire: యజమాని బెంజ్ కారుకు నిప్పంటించిన కూలీ.. సీసీ కెమెరాల్లో రికార్డు.. ఎందుకలా చేశాడంటే..

పార్టీ జరుగుతున్న ప్రదేశంలోకి సింహం రావడంతో అందరూ అక్కడినుంచి పరుగులు లంకించుకోగా.. ఓ వ్యక్తి మాత్రం వేగంగా వెళ్లి కొబ్బరిచెట్టును ఎక్కాడు. ఆ వ్యక్తిని టార్గెట్ గా చేసుకున్న సింహం కొబ్బరిచెట్టు ఎక్కినా వదల్లేదు. అదిసైతం కొబ్బరి చెట్టు ఎక్కి ఆ వ్యక్తిని వేటాడే ప్రయత్నం చేసింది. అయితే చెట్టు చివరికి ఎక్కిన వ్యక్తి కాళ్లతో సింహాన్ని తన్నాడు. ఈ వీడియో క్లిప్ అంతటితో ఆగిపోతుంది.. ఆ తరువాత ఆ వ్యక్తికి ఏమైనా జరిగిందా అన్న సమాచారం వీడియోలో కనిపించలేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. lions.habitat
అనే ఖాతాదారు తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలపలేదు. వీడియోను దాదాపు 2.5లక్షల మందికిపైగా నెటిజన్లు చూశారు. పలువురు నెటిజన్లు వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ కామెంట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు