Benz Car On Fire: యజమాని బెంజ్ కారుకు నిప్పంటించిన కూలీ.. సీసీ కెమెరాల్లో రికార్డు.. ఎందుకలా చేశాడంటే..

పని చేసినప్పటికీ యజమాని డబ్బులు ఇవ్వలేదని అనేకసార్లు కూలీలు గొడవులు పెట్టుకున్న సంఘటనలు మనం చూశాం. కొంతమంది యజమానిపై దాడులు చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కానీ ఓ కూలీ తన యజమాని పనిచేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ ప్రతీకారం చాలా కాస్ట్‌లీ.

Benz Car On Fire: యజమాని బెంజ్ కారుకు నిప్పంటించిన కూలీ.. సీసీ కెమెరాల్లో రికార్డు.. ఎందుకలా చేశాడంటే..

Benz Car On Fire

Benz Car On Fire: పని చేసినప్పటికీ యజమాని డబ్బులు ఇవ్వలేదని అనేకసార్లు కూలీలు గొడవులు పెట్టుకున్న సంఘటనలు మనం చూశాం. కొంతమంది యజమానిపై దాడులు చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కానీ ఓ కూలీ తన యజమాని పనిచేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ ప్రతీకారం ఖరీదు చాలా కాస్ట్‌లీ. యాజమానిపై కక్షపెంచుకున్న కూలీ బైక్ పై వచ్చి రోడ్డుపక్కనే పార్కుచేసి ఉంచిన యాజమానికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Ahmedabad : 7వ అంతస్థు నుంచి కుప్పకూలిన లిఫ్ట్ .. ఎనిమిదిమంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా సెక్టార్-39లోని సదర్‌పుర్ కాలనీలో మంగళవారం పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిస్​రఖ్​ ఠాణా పరిధిలోని జలాల్​పుర్​ గ్రామానికి చెందిన రణ్​వీర్​.. నొయిడాలోని సదర్​పుర్​ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్​ ఇంట్లో టైల్స్ పని చేశాడు. ఇందుకు సంబంధించి రణ్​వీర్​కు ఆయుష్​ రూ.68వేలు ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు రణ్​వీర్​ వచ్చి అడిగినా ఆయుష్​ డబ్బులు ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా డబ్బులు ఇవ్వకపోవటంతో రణ్ వీర్ యాజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్లుగా యాజమాని వ్యవహరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రణ్‌వీర్ యాజమాని కారుకు నిప్పటించాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నట్లుగానే మంగళవారం బైక్​పై సదర్​పుర్​ కాలనీకి బైక్​పై వచ్చాడు. ఇంటి ముందు పార్క్​ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించి.. పారిపోయాడు. కారుకు మంటలు అంటుకోవటంతో ముందుభాగం పూర్తిగా దగ్గమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావటంతో.. రణ్‌వీర్ వచ్చిన బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసును చేధించి రణ్‌వీర్ ను అరెస్టు చేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందురు నెటిజన్లు.. కారుకునిప్పు పెట్టడం సరైంది కాదని, ఏదైనా ఉంటే కేసుపెట్టి డబ్బులు వసూలు చేసుకుంటే బాగుండేదని కొందరు అంటుండగా.. మరికొందరు కార్మికుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కారుకు నిప్పంటించారని విమర్శించారు. మరికొందరు యాజమానికి సరియైన గుణపాఠం చెప్పాడంటూ పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు.