Corona Cases : దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు
భారత్ లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 164 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
- bheemraj
- Published On : October 19, 2021 / 03:48 PM IST
Corona
new corona positive cases : భారత్ లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 164 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం(అక్టోబర్ 19,2021)న హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో 19,470 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,83,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు భారత్‌లో వైరస్ బారిన పడి 4,52,454 మంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలోకెల్ల అత్యధికంగా కేరళలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 6,676 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 164 మంది మృతి చెందగా, అందులో 60 మంది కేరళలోనే మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
China Lockdown : చైనాలో మళ్లీ కరోనా పంజా.. లాక్‌డౌన్!
దేశంలో రికవరీ రేటు 98.14 శాతం ఉంది. మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వీక్లీ పాజిటివ్ రేటు 1.36 శాతంగా ఉంది. గత 50 రోజుల నుంచి డెయిలీ పాజిటివ్ రేటు 3 శాతం కన్నా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 98.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
