మందుబాబులకు బెంగళూరు మెట్రో అధికారులు శుభవార్త తెలిపారు. జనవరి 1న అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా బ్రీత్ అనలైజర్ టెస్టును చేయబోమని వెల్లడించారు.
మందుబాబులకు బెంగళూరు మెట్రో అధికారులు శుభవార్త తెలిపారు. జనవరి 1న అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా బ్రీత్ అనలైజర్ టెస్టును చేయబోమని వెల్లడించారు. మందుబాబులపై ఉన్న ఆంక్షలను న్యూ ఇయర్ రోజున సడలించినట్లు తెలిపారు. ఆ రోజు అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుస్తాయని అధికారులు ప్రకటించారు. కాగా గత కొద్దిరోజుల క్రితం మందు తాగిన వారిని మెట్రోలో అనుమతించబోమని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం మందుబాబులపై అమలు చేస్తోన్న ఆంక్షలను కొత్త సంవత్సరం సందర్భంగా సడలించారు. న్యూ ఇయర్ రోజు బ్రీత్ అనలైజర్ టెస్టును మినహాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బెంగుళూరు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే క్రిస్మస్ సందర్భంగా మందుబాబులకు మెట్రో అధికారులు నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు విమర్శలు తలెత్తాయి.
అలాగే న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని జనవరి 1 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీస్‌లను ప్రజలకు అందుబాటు ఉంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. అన్ని మెట్రో స్టేషన్లలో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.