పెళ్లికి వచ్చిన అతిధులకు ధర్మల్ స్క్రీనింగ్

  • Publish Date - June 7, 2020 / 05:40 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దశలవారీగా ఆంక్షల సడలింపులు ఇస్తూ ప్రజలకు తగు సూచనలు చేస్తోందికేంద్ర ప్రభుత్వం. ఇటీవల లాక్ డౌన్ 5 అమలు చేస్తూ  మరి కొన్ని ఆంక్షలు  సవరించింది. వ్యాపారస్తులకు కొన్ని మార్గదర్శకాలను జారిచేసింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సైతం కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సూచనలను అనుసరించి ఓ పెళ్లిక హాజరైన అతిథులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ను నిర్వహించారు.

మొరాదాబాద్‌లో శనివారం జరిగిన ఓ పెండ్లి వేడుకలో   పెళ్లికి వచ్చిన అతిధులకు నిర్వాహకులు కోవిడ్ టెస్టులు చేశారు.ఈ పెండ్లికి హాజరైయైన అతిథులకు మొదటగా ప్రవేశమార్గంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ను నిర్వహించారు. అదేవిధంగా హాండ్‌ శానిటైజర్‌తో చేతులను శుభ్రపరిచారు. అతిథుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. అతిథులందరికి మాస్కులు, ఫేస్‌ షీల్డ్స్‌లను అందజేశారు.