Olympic Medal Winners: ఇండియన్ ఒలింపిక్ మెడల్ విజేతలకు ఫ్రీ ట్రావెల్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్

టోక్యో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇండియన్ మెడల్ విన్నర్లకు ఆ ఎయిర్‌లైన్ ఫ్రీ ట్రావెల్ ప్రకటించేసింది. గోఎయిర్ అనే సంస్థ మరో ఐదేళ్ల పాటు పతక విజేతలు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ ఆదివారం వెల్లడించింది.

Olympic Medal Winners: టోక్యో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇండియన్ మెడల్ విన్నర్లకు ఆ ఎయిర్‌లైన్ ఫ్రీ ట్రావెల్ ప్రకటించేసింది. గోఎయిర్ అనే సంస్థ మరో ఐదేళ్ల పాటు పతక విజేతలు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ ఆదివారం వెల్లడించింది.

‘ఒలింపిక్స్ 2020లో ఇండియా ఖ్యాతిని పెంచిన వారి గొప్పదనానికి నిదర్శనంగా ఇలా చేసింది. మా నెట్‌వర్క్ పరిధిలో మరో ఐదేళ్ల పాటు ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ఇచ్చేందుకు సంతోషిస్తున్నాం’ అని ఓ ట్వీట్ లో వెల్లడించింది. అంటే 2025వరకూ విమాన ప్రయాణం ఉచితం అన్నమాట.

‘మీరాభాయి చాను (వెయిట్ లిఫ్టింగ్ – కాంస్యం), పీవీ సింధు (బ్యాడ్మింటన్ – కాంస్యం), లవ్లీనా బార్గొహైన్ (బాక్సింగ్ – కాంస్యం), పురుషుల హాకీ జట్టు – కాంస్యం, రవి కుమార్ దాహియా (రెజ్లింగ్ – రజతం), భజరంగ్ పూనియా (రెజ్లింగ్ – కాంస్యం), గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో – స్వర్ణం)లకు మరో ఐదేళ్ల పాటు ఫ్రీ ఎయిర్ ట్రావెల్ అందిస్తున్నారు.

మరో ప్రాంతీయ ఎయిర్‌లైన్ సంస్థ అయిన స్టార్ ఎయిర్ ఇండియన్ ఒలింపిక్ ఛాంపియన్స్ కు లైఫ్ టైం ఫ్రీ ఎయిర్ ట్రావెల్ ఆఫర్ ఇచ్చేసింది.

ఇక గోల్డ్ మెడల్ విన్నర్.. నీరజ్ చోప్రాకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది ఇండిగో.. సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ ఫ్రీ ట్రావెల్ చేసుకోవచ్చనే అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ 2021 ఆగష్టు 8 నుంచి 2022 ఆగష్టు 7వరకూ అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు