COVID-19: NASA వెంటిలేటర్ల తయారీకి లైసెన్స్ పొందిన భారతీయ కంపెనీలు ఇవే!

  • Publish Date - May 30, 2020 / 10:56 PM IST

కరోనాతో బాధపడుతున్న రోగుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన వెంటిలేటర్లను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు నాసా నుండి లైసెన్సులను పొందాయి. అవేంటంటే.. ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భారత్‌ ప్రాగ్‌ లిమిటెడ్‌, మేధా సర్వ్‌ డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు అనుమతి పొందినట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. 

అంతేకాదు భారతీయ సంస్థలతో పాటు మరో 18 కంపెనీలకు ఈ అనుమతి లభించింది. వీటిలో 8 అమెరికన్‌ కంపెనీలు, 3 బ్రెజీలియన్‌ కంపెనీలు కూడా ఈ అనుమతులు పొందినట్లు నాసా వెల్లడించింది. ఇక నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NASA), దక్షిణ క్యాలీఫోర్నియాలోని  జెట్‌ ప్రపల్షన్‌ ల్యాబొరేటరీ (JLP) వద్ద కరోనా వైరస్ రోగుల కోసం ప్రత్యేకంగా వెంటిలేటర్ ను అభివృద్ధి చేసింది.

అత్యవసర పరిస్థితులో ఈ వెంటిలేటర్‌ను వాడేందుకు  అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 30న ఆమోదం తెలిపింది. వైద్యులు మరియు వైద్య పరికరాల తయారీదారుల ఇన్ పుట్ తో విటల్ ను అభివృద్ధి చేసినట్లు NASA తెలిపింది. అంతేకాదు సంప్రదాయ వెంటిలేటర్ల కంటే అతితక్కువ వ్యయంతో వీటిని తయారు చేయవచ్చని NASA పేర్కొంది. సాధారణ వెంటిలేటర్‌ తయారిలో వాడే పరికరాలలో 7 వంతు మాత్రమే వినియోగించి ఈ వైటల్‌ వెంటిలేటర్‌ను తయారు చేసినట్లు తెలియచేసింది.