ప్రాణాలు తీసిన కార్చిచ్చు: వేల ఎకరాల్లో పంట బూడిద 

  • Publish Date - April 8, 2019 / 05:30 AM IST

హోషంగాబాద్‌  : అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వేలాది పంటలను బూడిద చేయటంతోపాటు ముగ్గురి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్‌ లోని హోషంగాబాద్‌ జిల్లాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఎకరాల్లో పంటలు అగ్నికి ఆహుతయ్యిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మరో 25 మంది గాయపడ్డారు. మృతులను స్థానికంగా ఉన్న  పంజ్రా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ క్రమంలో గాయపడిన 25మందిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా అడవుల్లో చెలరేగిన ఈ కార్చిచ్చుకు ఈదురు గాలులు తోడవడంతో మంటలు ఆ చుట్టుపక్కల 30 గ్రామాలకు వ్యాపించాయి. 

ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, సాధారణంగా గాయపడిన వారికి రూ.59వేలను ప్రకటించింది. పంట నష్ట పోయిన వారికి కూడా పరిహారం అందజేస్తామని వెల్లడించింది.