Three Sisters Marry One Person: విడిపోలేమని వింత నిర్ణయం.. ఒకే వరుడితో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. సోషల్ మీడియాలో రచ్చ!

ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు పెళ్లి(Three Sisters Marry One Person) తర్వాత కూడా కలిసే ఉండాలని చివరికి ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవడమే సరైన మార్గమని భావించారు.

Three up sisters marry same cameraman at temple viral wedding

  • విడిపోలేక ఒకే వ్యక్తితో వివాహం
  • కెమెరామెన్‌ను పెళ్లాడిన సోదరీమణులు
  • నెట్టింట వైరలైన విచిత్ర పెళ్లి

Three Sisters Marry One Person: పెళ్లయ్యాక ఒకరికొకరు దూరమవ్వాల్సి వస్తుందనే తీవ్ర ఆందోళనతో ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వింత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) అనే ముగ్గురు సోదరీమణులు పెళ్లి తర్వాత కూడా కలిసే ఉండాలని భావించారు. విడిపోవాల్సి వస్తే ప్రాణాలు తీసుకుందామనుకున్న వీరు, చివరికి ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవడమే సరైన మార్గమని భావించారు. ఈ క్రమంలోనే తమ సోషల్ మీడియా వీడియోలకు కెమెరామెన్‌గా పనిచేస్తున్న వికాస్ అనే యువకుడిని చాముండా మాత ఆలయంలో ఈ జులై 17న హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరందరిదీ ధౌరియా గ్రామం కాగా, ఈ విచిత్ర వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడంతో నెట్టింట విపరీతంగా వైరల్ అయి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Paper Leak Law: ఇక పేపర్ లీకేజీలకు చెక్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా

సోషల్ మీడియా రీల్స్ నుండి నిజ జీవితంలోకి – వికాస్‌తో వివాహం:

ఈ ముగ్గురు యువతులు(Three Sisters Marry One Person) సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా వికాస్ వీరి వీడియోలకు కెమెరామెన్‌గా పనిచేస్తూ, రీల్స్‌లో తరచూ వీరి భర్త పాత్రను పోషించేవాడు. విడిపోవడానికి ఇష్టం లేక వీరు ముగ్గురు ప్రతిపాదించిన ఈ వింత విజ్ఞప్తికి, వారి భావోద్వేగాలను గౌరవించి వికాస్ కూడా వివాహానికి అంగీకరించాడు. పూజారి సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బంధువులెవరూ పాల్గొనలేదు. వరుడు వరుసగా ముగ్గురి నుదుటిన సిందూరం దిద్ది, వారితో కలిసి ఏడు అడుగులు వేశాడు. తామంతా మేజర్లుగా తమ సొంత నిర్ణయంతోనే ఈ వివాహం చేసుకున్నామని, తమ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు నెటిజన్లను కోరారు.

సోషల్ మీడియాలో వైరల్ – వ్యక్తమవుతున్న మిశ్రమ స్పందనలు:

వైరల్ అయిన ఈ పెళ్లి వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని కేవలం రీల్స్ ప్రచారం కోసం చేసిన విన్యాసంగా కొట్టిపారేయగా, మరికొందరు వారి వ్యక్తిగత స్వేచ్ఛను మద్దతు ఇచ్చారు. విమర్శలకు సమాధానంగా, ప్రాచీన కాలంలో దశరథ మహారాజుకు కూడా ముగ్గురు భార్యలు ఉన్నారని సదరు అక్కాచెల్లెళ్లు రామాయణాన్ని ఉదాహరించారు. అయితే, చట్టపరమైన కోణంలో చూస్తే ‘హిందూ వివాహ చట్టం 1955’ ప్రకారం మొదటి భార్య జీవించి ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని పలువురు చట్ట నిపుణులు, నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.