TikTok పిచ్చి..డబ్బు బలుపు : పెళ్లి ఊరేగింపులో రూ.2 వేల నోట్లు విసురుతూ..

  • Publish Date - December 7, 2019 / 06:37 AM IST

పెళ్లి ఊరేగింపులో రూ.2వేల నోట్లు..రూ.500ల నోట్లు విసురుతున్న బిజినెస్ మ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా బిజినెస్ మ్యాన్. అతనికి సోషల్ మీడియాలో  మంచి క్రేజ్ ఉంది. రుషిరాజ్ సిన్హా బిజినెస్ మ్యాన్ గా కంటే..సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. కాస్ట్లీ కార్లు, హార్స్ రేస్ లతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రుషిరాజ్ సిన్హా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 

ఈ సందర్భంగా పెళ్లి  ఊరేగింపులో పాల్గొన్న జనాలపై రూ.500, రూ.2000 నోట్లను చిత్తు కాగితాల్లా విసిరాడు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరు డబ్బులు విసురుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. 

టిక్‌టాక్ క్రేజ్‌తోనే ఇలా చేశారని అంటున్నారు నెటిజన్లు. ఏకంగా పెద్ద నోట్లను గాల్లో విసరడం చూసినవారంతా..నోరు వెళ్లబెడుతున్నారు.ఏమా డబ్బు బలుపు అంటున్నారు. డబ్బులు ఎక్కువైతే జనాలు ఇలాగే తయారవుతారేమో అంటూ బుగ్గన వేలు పెట్టుకుని తెగ ఆశ్చర్యపోతున్నారు.

పెళ్లి కోసం జామ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లా గ్రామంలో భరాత్ చేశారు. దీని కోసం పెళ్లి కొడుకు..పెళ్లి కూతురు పెళ్లి వేదిక వద్దకు వెళ్లేందుకు రోడ్డుపై కాకుండా గాల్లో వెళ్లారు. అదేనండీ..ఈ 20 కిలోమీటర్లు దూరానికి హెలికాప్టర్లో వెళ్లడం మరో విశేషం. డబ్బులు విసరుతున్న ఈ వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది.