Too fat to fit: లావుగా ఉన్నాడంటూ వదిలేసిన ప్రియురాలు.. అద్దిరిపోయే బాడీతో షాకిచ్చిన యువకుడు.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ

లావుగా ఉన్నాడంటూ ఆ యువకుడిని వదిలేసి వెళ్లింది ప్రేయసి. అయితే, అందరిలా బాధపడుతూ కూర్చోకుండా ఇప్పుడు శరీరాన్ని అందంగా మలచుకున్నాడు ఆ యువకుడు. భారీ కాయాన్ని అద్భుతమైన దేహంగా మలచుకున్న అతడి జర్నీ స్ఫూర్తిదాయకం.

Too fat to fit: భారీ కాయంతో లావుగా ఉన్నాడని ఆ యువకుడిని వదిలేసి వెళ్లింది ప్రేయసి. అయితే దీనికి బాధపడి అక్కడే ఆగిపోకుండా, తన బాడీని అందంగా మలుచుకున్నాడు ఆ యువకుడు. తన ఆకృతి నచ్చక వదిలివెళ్లిన ప్రేయసి కూడా ఆశ్చర్యపోయేలా అద్భుతంగా శరీరాన్ని మార్చుకున్నాడు. 19 నెలల్లోనే క్రమశిక్షణ, పట్టుదలతో పర్ఫెక్ట్ బాడీ షేప్ సాధించిన ఈ యువకుడు చాలా మందికి ఆదర్శం.

Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

పువి అనే యువకుడు 144 కేజీల బరువుండే వాడు. తన శరీరాన్ని తనే మోయడం కష్టంగా ఉండేది. ఇంత బరువు ఉండటంతో అతడి ప్రేయసి కూడా అతడ్ని వదిలేసింది. అయితే, అందరిలా బాధపడుతూ కూర్చోకుండా.. ఏ బాడీ బాగోలేదని తనను ప్రేయసి వదిలేసిందో.. అదే బాడీని అందంగా మలచుకోవాలనుకున్నాడు. దీనికోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీలైనంతగా బరువు తగ్గి, ఫిట్‌గా ఉండాలనుకున్నాడు. తన వర్కవుట్, డైట్ ప్లాన్ మొదలుపెట్టేముందు గత ఏడాది జనవరి 14న ఒక పిక్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి వర్కవుట్లు స్టార్ట్ చేశాడు. అప్పుడు 144 కేజీల బరువున్న ఆ యువకుడు ఇప్పుడు 74 కేజీల బరువు మాత్రమే ఉన్నాడు. అంటే 19 నెలల్లోనే 70 కేజీల బరువు తగ్గాడు. అంతేకాదు.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

తనలోని ఈ మార్పునకు సంబంధించి అతడే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతడి పోస్టుకు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. పువిని అభినందిస్తున్నారు. బరువు తగ్గడం వల్ల తనను తాను కొత్తగా చూసుకుంటున్నట్లు, ఇతరులు కూడా తనను చూసే దృక్పథం మారినట్లు పువి చెప్పాడు. తను కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు మళ్లీ సొంతమైందన్నాడు. నిజంగా అతడి శరీరంలో వచ్చిన మార్పు ఎలాంటిదో మీరూ చూడండి.

 

ట్రెండింగ్ వార్తలు