Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

అన్న తిట్టాడని మనస్థాపంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరుసకు అక్కచెల్లెళ్లు అయ్యే ఇద్దరూ టీనేజర్లే. ఒకరి వయసు 15కాగా, మరొకరి వయసు 16. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

Updated On : August 23, 2022 / 6:19 PM IST

Sisters Suicide: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అన్న తిట్టాడని ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ మైనర్లే కావడం గమనార్హం. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, బరేలీ జిల్లా, నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక అన్నయ్య తన ఇద్దరు చెల్లెళ్లను ఒక విషయం గురించి తిట్టాడు.

Bilkis Bano: బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదలపై సుప్రీకోర్టులో పిల్

దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు బాలికలు దగ్గర్లో ఉన్న ఒక షాప్‌కు వెళ్లి విషం కొనుక్కున్నారు. తర్వాత అక్కడే ఒక ప్రదేశంలో విషం తాగి ఇంటికి వచ్చారు. ఇంటికి చేరుకున్న తర్వాత వారి పరిస్థితి విషమించింది. అప్పుడు తాము విషం తీసుకున్న విషయాన్ని బాలికలు, కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిలో ఒక బాలిక ఆస్పత్రికి వెళ్లేలోపే చనిపోయింది. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరణించిన బాలికలు ఇద్దరూ టీనేజర్లే. ఒకరి వయసు 15కాగా, మరొకరి వయసు 16. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Terrorists killed: భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని, బాలిక వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆమె మరణించే ముందు ఘటనకు సంబంధించిన విషయాన్ని అధికారులకు చెప్పింది. తన సోదరుడు తిట్టడం వల్ల, విషం తాగి చనిపోవాలని ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు.