Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర : బీజేపీ నేత సువేందు అధికారి సంచలన ఆరోపణలు

ఒడిశా రైళ్ల ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర ఉందని ఆరోపణలు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ లో ఏముంది? ఎందుకు టీఎంసీపై ఆరోపణలు?

Odisha Train Accident BJP Suvendu : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణమేంటీ అనేదిదానిపై విచారణ జరుగుతోంది.ఈ క్రమంలో ఈ రైలు ప్రమాదానికి కారణం తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) హస్తం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి. ఈ రైలు ప్రమాదంలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోటానికి కారణం టీఎంసీ కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఈ ప్రమాదం ఘటన మరో రాష్ట్రానికి చెందినప్పుడు ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారని టీఎంసీ నేతలను ప్రశ్నించారు. రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ చేపడితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

 

జూన్ 2న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ స్టేషన్ లో మూడు వేర్వేరు ట్రాక్ లపై బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్,కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదంలో దాదాపు 300లమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రైళ్ల ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర ఉంది అంటూ ఆరోపించారు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను టీఎంసీ నేత కునాల్ ఘోష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సువేందు ఆ ఆడియోకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తు ఈ ఆరోపణలు చేశారు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణ వీరికి ఎలా తెలిసింది?.. ఆ సంభాషణ ఎలా లీక్ అయింది? అని ప్రశ్నించారు. దీనిపై నిజనిజాలు సీబీఐ విచారణలో బయటకు వచ్చి తీరాలన్నారు. అవసరమైతే దీనిపై కోర్టుకు కూడా వెళ్తాననని తెలిపారు.

 

కాగా ఒడిశా రైలు ప్రమాదంపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించాలన్న రైల్వే బోర్డు నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ కేసును కూడా సీబీఐకి ఇస్తే ఫలితం రాలేదన్నారు. 12 ఏళ్లు గడిచినా ఫలితం కనిపించడం లేదని అన్నారు. దీనిపై సువేందు టీఎంసీ ఎందుకు భయపడుతోంది? ఈ ప్రమాదం వెనుక వారి కుట్ర ఉందని భయపడుతోంది అంటూ ఆరోపించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు