TMC MP Nusrat Jahan : భర్త నుంచి అందుకే విడిపోయా.. తృణమూల్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌

ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ తన భర్త నిఖిల్‌ జైన్‌ నుంచి విడిపోవడానికి గల కారణాలను వెల్లడించారు.

Tmc Mp Nusrat Jahan

TMC MP Nusrat Jahan :  ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ తన భర్త నిఖిల్‌ జైన్‌ నుంచి విడిపోవడానికి గల కారణాలను వెల్లడించారు. నిఖిల్‌ జైన్‌తో తనకు టర్కిష్‌ చట్టం ప్రకారం వివాహం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదని ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నుస్రత్‌ ఇటీవల నటుడు,రాజకీయ నాయకుడు యాష్‌దాస్‌గుప్త తో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె తన వైవాహిక జీవితానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు.

తనకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు అక్రమంగా నిఖిల్‌ జైన్‌ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తనకు చెందిన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు.

‘భారత చట్టాల ప్రకారం నిఖిల్ జైన్ తో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదు కనుక ఇంక విడాకుల ప్రశ్నే తలెత్తదని ఆమె పేర్కోన్నారు. మేమిద్దరం ఎప్పుడో విడిపోయామని… నా వ్యక్తిగత జీవితాన్ని బహిరంగ పరుచుకోవటం ఇష్టంలేక ఇన్నాళ్లు చెప్పలేదు అని ఆమె అన్నారు.

2019 లో టర్కీలో ఆమె నిఖిల్ జైన్ ను పెళ్లిచేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన కొన్నివారాలకే ఆమె వివాహం చేసుకున్నారు. ఆతర్వాత కోల్‌కతాలో జరిగిని రిసెప్షన్ కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హజరయ్యారు.

నాకు ఎవరి డబ్బుపై వ్యామోహం లేదని, తన సొంత ఖర్చులతోనే కుటుంబ పోషణ చేస్తున్నానని నుస్రత్‌ తెలిపారు. వారి అవసరాల కోసం తన పేరును, డబ్బును వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికీ తన బ్యాంకు ఖాతా ద్వారా నిఖిల్ డబ్బు వాడుకుంటున్నాడని  ఆమె చెప్పారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే అవసరం ఎవరికి లేదని నుస్రత్‌ జహాన్‌ స్పష్టం చేశారు.