మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్

మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్

  • Publish Date - December 17, 2019 / 03:50 PM IST

మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్

మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జెస్) మరో ఏడాది కొనసాగనున్నాయి. ఈ మేరకు ట్రాయ్ నుంచి ప్రకటన వచ్చింది. ఐయూసీ కింద ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు టెలికాం కంపెనీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయించింది.

దీంతో 2020 వరకు ఐయూసీ ఛార్జీలు చెల్లించక తప్పదు. 2021 జనవరి 1 నుంచి ఐయూసీ చార్జీలు ఉండవు. కాగా గతంలో 2020 జనవరి 1 నుంచి ఐయూసీ చార్జీలు వసూలు చేయకూడదని ట్రాయ్ చెప్పింది. తాజాగా మరో ఏడాది పెంచింది. ఐయూసీ చార్జీల కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడింది. ఇప్పటికే జియో సంస్థ తమ యూజర్లు నుంచి ఐయూసీ చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.