శిక్షణ విమానం కూలి ఇద్దరు మృతి 

  • Publish Date - June 8, 2020 / 06:48 AM IST

ఒడిషాలో ఒక శిక్షణా విమానం కూలిపోయిన ఘటనలో  ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. ధెన్కనల్ జిల్లా కంకదహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి శిక్షణ కోసం బయలు దేరిన విమానం సోమవారం ఉదయం సాంకేతిక లోపం తో కూలిపోయింది. ఈ ఘటనలో వ బీహార్ కు చెందిన కెప్టెన్ సంజీవ్ కుమార్, తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ అనిస్ ఫాతిమాలు ప్రాణాలుకోల్పోయారు. పోస్టు మార్ట నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 

Read:  జైలునుంచి పరారై 600కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి..బ్యాంకు దోచేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ…