ఆడపిల్ల పుట్టిందని ట్రిపుల్ తలాక్

  • Publish Date - August 24, 2019 / 05:31 AM IST

ట్రిపుల్ తలాక్ కోసం చట్టం తీసుకొచ్చినా..కేసులు మాత్రం నమోదవుతున్నాయి. దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. అదనపు కట్నం కోసం..ఇతరత్రా కారణాలతో ట్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు. తాజాగా ఆడపిల్ల పుట్టిందని ఓ వ్యక్తి తలాక్ చెప్పేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అయోధ్య జిల్లాలోని జానా బజార్‌కు చెందిన జాప్రిన్ అంజుమ్‌కు అస్తిఖర్ అహ్మద్‌తో 2018లో వివాహం జరిగింది. ఆమె గర్భవతి అయ్యింది. ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే అస్తిఖర్ తెగదెంపులు చేసుకోవాలని అనుకున్నాడు. జాప్రిన్‌కు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. 

తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ జాఫ్రిన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలంటూ వేధించే వాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు – 2019 బిల్లును పార్లమెంట్ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. మూడుసార్లు తలాక్ చెబితే..మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించనన్నారు. అతడిని అరెస్టు చేసినట్లు..కేసును రిజిష్టర్ చేసుకుని విచారించడం జరుగుతోందని అయోధ్య (రూరల్) ఎస్పీ వెల్లడించారు. 
Read More : ఉగ్రవాద ముప్పు : తిరుమలకు ఇంటిలిజెన్స్ హెచ్చరిక