10 Minute Delivery: 10 మినిట్ డెలివరీ.. నిన్న బ్లింకిట్.. ఇప్పుడు జెప్టో, స్విగ్గీ కీలక నిర్ణయం

గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 10 మినిట్స్ డెలివరీ ప్రకటనను ఎత్తివేయాలని, అసలు ఇటువంటి హామీలు ఇవ్వొద్దని డెలివరీ సంస్థలకు సూచించారు.

10 Minute Delivery: 10 మినిట్ డెలివరీ.. నిన్న బ్లింకిట్.. ఇప్పుడు జెప్టో, స్విగ్గీ కీలక నిర్ణయం

Swiggy Zepto Representative Image (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 7:25 PM IST
  • 10 మినిట్ డెలివరీపై వెనక్కి తగ్గిన జెప్టో, స్విగ్గీ
  • వెబ్‌సైట్లు, యాప్స్ నుంచి ప్రకటనలు తొలగింపు
  • గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమం దృష్టిలో ఉంచుకుని నిర్ణయం

 

10 Minute Delivery: కేంద్రం ఆదేశాలతో 10 మినిట్ ఆన్‌లైన్ డెలివరీ విధానం బంద్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు క్విక్ కామర్స్ సంస్థలు దీనిపై ప్రకటన చేశాయి. తక్షణమే 10 నిమిషాల్లో డెలివరీ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వ ఆదేశాలతో తొలుత బ్లింకిట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల్లో డెలివరీ హామీని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని మిగిలిన సంస్థలు సైతం హామీ ఇచ్చాయి. తాజాగా మరో రెండు సంస్థలు ఈ జాబితాలో చేరాయి. క్విక్‌ కామర్స్‌ సంస్థలు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, జెప్టో 10 నిమిషాల నిర్దేశిత డెలివరీ ప్రామిస్ ని నిలిపేశాయి. తమ వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి 10 మినిట్స్ డెలివరీ ప్రకటనలు, ట్యాగ్స్ ను తొలగించాయి.

నిత్యవసరాల నుంచి తిండి వస్తువుల వరకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామంటూ బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌ వంటి సంస్థలు ప్రకటనలు ఇచ్చాయి. చెప్పినట్లే 10 నిమిషాల్లోనే కస్టమర్లు బుక్‌ చేసుకున్న పదార్థాలు, వస్తువులను గిగ్‌ వర్కర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాయి. అయితే వేగంగా డెలివరీ నిబంధనను గిగ్ వర్కర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రకటనతో తమపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.
ఈ నిబంధన కారణంగా తాము ప్రమాదాల బారిన పడుతున్నామని, తమ ప్రాణాలు రిస్క్ లో పడుతున్నాయని గిగ్ వర్కర్లు వాపోయారు. 10 మినిట్స్ డెలివరీ నిబంధనను ఎత్తివేయాలని.. తమకు భద్రత కల్పించాలని గిగ్‌ వర్కర్లు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.

గిగ్ వర్కర్ల ఆందోళనలతో కేంద్రం ఎంట్రీ ఇచ్చింది. ఆన్‌లైన్‌ క్విక్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థలతో (బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ) కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చర్చలు జరిపారు. గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 10 మినిట్స్ డెలివరీ ప్రకటనను ఎత్తివేయాలని, అసలు ఇటువంటి హామీలు ఇవ్వొద్దని డెలివరీ సంస్థలకు సూచించారు. దీనికి ఆయా సంస్థలు సానుకూలంగా స్పందించాయి. 10 నిమిషాల నిర్దేశిత సమయాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాయి.

బ్రాండింగ్‌ లో మార్పు ఉంటుందని, కానీ కస్టమర్లకు క్విక్‌ డెలివరీలు మాత్రం ఎప్పటిలానే కొనసాగుతాయని క్విక్ ప్లాట్ ఫామ్ సంస్థలు స్పష్టం చేశాయి. కాగా, 10 నిమిషాల్లో డెలివరీ నిబంధన తొలగించడం వల్ల గిగ్ వర్కర్లకు బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది. కేంద్రం ఆదేశాల పట్ల గిగ్ వర్కర్లు, డెలివరీ ఏజెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పాత పన్ను విధానం పూర్తిగా ఎత్తేస్తారా? ఇక కొత్త పన్ను విధానమే ఎంచుకోవాలా? టాక్స్ పేయర్లకు బెనిఫిట్స్ ఏంటి?