Budget 2026 : పాత పన్ను విధానం పూర్తిగా ఎత్తేస్తారా? ఇక కొత్త పన్ను విధానమే ఎంచుకోవాలా? టాక్స్ పేయర్లకు బెనిఫిట్స్ ఏంటి?

Budget 2026 : త్వరలో బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది కేంద్రం. ట్యాక్స్ పేయర్లలో ఇప్పుడు ఒకటే టెన్షన్.. పాత పన్ను విధానాన్ని ఎత్తేస్తారా? లేదా కొత్త పన్ను విధానాన్ని ఏకైక ఆప్షన్ గా ఉంచుతారా? పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Budget 2026 : పాత పన్ను విధానం పూర్తిగా ఎత్తేస్తారా? ఇక కొత్త పన్ను విధానమే ఎంచుకోవాలా? టాక్స్ పేయర్లకు బెనిఫిట్స్ ఏంటి?

Budget 2026 (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 4:46 PM IST
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026
  • కొత్త పన్ను విధానమే అమల్లో ఉంటుందా?
  • పాత పన్ను విధానం పూర్తిగా రద్దు కానుందా?

Budget 2026 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. రాబోయే కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్నుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు.

అయితే, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సామాన్యుల నుంచి పన్నుచెల్లింపుదారులు, ముఖ్యంగా నెలవారీ జీతాలు పొందేవాళ్లు కూడా ఆదాయపు పన్నుకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉంటాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాక్స్ పేయర్లలో ఆదాయపు పన్ను, పన్ను చెల్లింపుల విషయంలో ఒకటే గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు ఎంచుకునే విధానం పాత లేదా కొత్త విధానం ఏది అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ఆదాయ పన్ను అమలుతో పాత పన్ను విధానం ఎత్తేస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది.

2026 బడ్జెట్ కు ముందు కొన్ని సర్వేల్లో చాలా మంది నిపుణులు పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎత్తేయాలని కేంద్రం యోచిస్తోందని అభిప్రాయపడ్డారు. కాకుంటే దశలవారీగా ఈ మార్పులు ఉంటుందని అంటున్నారు.

పాత, కొత్త పన్ను విధానంలో తేడాలేంటి? :
కొత్త, పాత పన్ను విధానంలో అంశాల్లో చాలా తేడా ఉంటుంది. పాత పన్ను విధానంతో పోలిస్తే అధిక స్థాయి ఆదాయంలో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. అంటే తక్కువ డెడెక్షన్లు, మినహాయింపులు ఉంటాయి.

అదే కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది. సెక్షన్ 87A రిబేటుతో జీతం పొందే టాక్స్ పేయర్లు పన్ను రహిత ఆదాయ స్థాయి రూ. 12.75 లక్షలకు (స్టాండర్డ్) మినహాయింపుతో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నెలకు రూ. 1 లక్షసంపాదించే వ్యక్తి జీరో పన్ను చెల్లించాలి.

Budget 2026

Budget 2026 (Image Credit To Original Source)

మరోవైపు.. పాత పన్ను విధానం కింద డిడెక్షన్లు, మినహాయింపులు పొందే ఎంపికను బట్టి ఉంటుంది. గత కొన్నేళ్లుగా కేంద్రం కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఎక్కువగా ప్రయోజనాలను చేర్చింది.

పాత ఆదాయపు పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు, తగ్గింపులను పరిశీలిస్తే.. సెక్షన్ 80C ప్రయోజనాలు (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ వంటి పెట్టుబడులకు రూ. 1.5 లక్షల వరకు), వైద్య బీమా కోసం సెక్షన్ 80D, NPS కాంట్రిబ్యూషన్స్, ఇంటి అద్దె భత్యం (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA), సెక్షన్ 80 TTA (బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ), గృహ రుణ వడ్డీ ప్రయోజనాలు ఉన్నాయి.

కొత్త పన్ను విధానం ఎందుకంటే? :

పాత పన్ను విధానంలో కన్నా కొత్త పన్ను విధానం పన్నుచెల్లింపుదారులకు చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. ఐటీఆర్ దాఖలు ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. పన్ను రికార్డులు, పేపర్ వర్క్ తగ్గించే దిశగా ఐటీఆర్ విధానాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు.

Read Also : Apple iPhone 17 Series : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో ఐఫోన్ 17 సిరీస్‌పై ఫస్ట్ టైమ్ భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టం వివిధ మినహాయింపులు, తగ్గింపులతో అందిస్తోంది. అయితే, పన్ను చెల్లింపుదారులకు, ఆదాయపు పన్ను శాఖపై భారాన్ని పెంచింది. అయితే ఈ భారాన్ని తగ్గించేందుకు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేలా పాత పన్ను విధానాన్ని దశలవారీగా తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడే మినహాయింపులు, డిడెక్షన్లను దశలవారీగా తొలగించాలనే నిర్ణయాన్ని ప్రస్తావించింది. పాత పన్ను విధానంతో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు భారీగా లాభదాయకంగా మారింది.

కొత్త పన్ను విధానానికి ఎక్కువ ఆదరణ :
ఇటీవలే డేటాను పరిశీలిస్తే.. 2024-25 అసెస్ మెంట్ ఇయర్ కోసం దాదాపు 72 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్నే ఎంచుకున్నారు. పాత పన్ను విధానం కన్నా చాలా సులభంగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అందుకే కేంద్రం కూడా పాత పన్ను విధానాన్ని పక్కన పెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కానీ, ఒకేసారి కాకుండా దశలవారీగా తొలగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. కొత్త ఆదాయ పన్ను స్లాబ్ లను సవరించాక రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. అలా అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కొత్త పన్ను శ్లాబులు ఇలా :

  • 0-4 లక్షల వరకు ఎలాంటి టాక్స్ ఉండదు
  • 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5 శాతం పన్ను
  • 8-12 లక్షల వరకు 10 శాతం పన్ను
  • 12-16 లక్షల వరకు 15 శాతం పన్ను
  • 16-20 లక్షల వరకు 20 శాతం పన్ను
  • 20-24 లక్షల వరకు 25 శాతం పన్ను
  • 24 లక్షలకు పైగా ఆదాయం 30 శాతం పన్ను

పాత పన్ను విధానం శ్లాబులు ఇలా :

  • 2,50,000 వరకు ఎలాంటి టాక్స్ లేదు
  • 2,50,000 నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను
  • రూ. 5,00,001 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 20 శాతం పన్ను
  • రూ. 10 లక్షలకు పైగా ఆదాయం 30 శాతం పన్ను

పాత పన్ను విధానం పూర్తిగా ఎత్తేస్తారా? :

సేవింగ్స్ ప్రొత్సహించడం, గృహరుణ సంబంధిత పన్ను ప్రయోజనాలను అందించే విషయంలో మినహాయింపులు, తగ్గింపులు చాలా ముఖ్యమని కొందరు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే, పాత పన్ను విధానం క్రమంగా తొలగించే పరిస్థితి కనిపిస్తోంది.

కేంద్రం కూడా కొత్త పన్ను విధానం వైపే మొగ్గు చూపుతోంది. అందుకే డిఫాల్ట్ పన్ను విధానంగా మార్చేసింది. కొత్త పన్ను విధానం వైపు పన్ను చెల్లింపుదారులను నడిపించేలా రెండు పన్ను విధానాలను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.

ఒకవేళ పాత పన్ను విధానం పూర్తిగా రద్దు చేస్తే సామాన్య పన్ను చెల్లింపుదారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే పాత పన్ను తొలగించే బదులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేలా అవకాశం ఇస్తోంది. ఇందులో పాత పన్ను ఒక ఆప్షనల్ మాత్రమేనని సూచిస్తోంది. కొత్త పన్ను విధానానికి అలవాటుపడిన తర్వాత రాబోయే ఏళ్లలో పాత పన్ను విధానం ఎంపిక పూర్తిగా నిలిపివేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.