Trisha at Vijay residence : తమిళనాట టీవీకే ప్రభంజనం.. విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష.. వీడియో వైరల్
Trisha arrives at Vijay residence : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీవీకే శ్రేణులు విజయ్ ఇంటివద్దకు భారీగా చేరుకొని సంబురాల్లో మునిగిపోయారు. సినీనటి త్రిషకూడా విజయ్ నివాసానికి చేరుకున్నారు.
- Harish Thanniru
- Updated on- May 4, 2026 / 02:44 PM IST
Trisha arrives at Vijay residence
Trisha arrives at Vijay residence : తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే పార్టీ అభ్యర్థులు వందకుపైగా స్థానాల్లో విజయం వైపు దూసుకెళ్తున్నారు. తాజా ఫలితాల నేపథ్యంలో హంగ్ ఏర్పాటుకు అవకాశం ఉంది. అయితే, టీవీకే అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో విజయ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : TVK Vijay-Trisha : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం.. ట్రెండింగ్‌లో త్రిష.. కీలక పదవి దక్కబోతుందా?
టీవీకే భారీ విజయం సాధించిన నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్దకు పార్టీ శ్రేణులు, విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని సంబురాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చుతూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. అయితే, సినీ నటి త్రిష కూడా విజయ్ నివాసానికి వచ్చారు. టీవీకే భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఆమె విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే త్రిషకు కీలక పదవి దక్కబోతుందని తమిళనాట రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
