TVK Vijay-Trisha : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం.. ట్రెండింగ్లో త్రిష.. కీలక పదవి దక్కబోతుందా?
TVK Vijay-Trisha Tamil Nadu Results : విజయ్ టీవీకే పార్టీ విజయంలో త్రిష పాత్ర కూడా ఉందంటూ తమిళ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ బలోపేతానికి త్రిష బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెకు త్వరలో ఏర్పాటయ్యే విజయ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతుందా అనే చర్చ కూడా మొదలైంది.
Thalapathy Vijay and Trisha
TVK Vijay-Trisha Tamil Nadu Election Results 2026 : తమిళనాడు రాజకీయాల్లో పెనుసంచలనం నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. 110 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆ తరువాత స్థానంలో ఏడీఎంకే ఉండగా.. అధికార డీఎంకే పార్టీ మూడో స్థానంకు పడిపోయింది. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడం.. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయితే.. ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషిస్తుందనే చర్చ నడుస్తోంది.
Also Read : Mamata Banerjee : పశ్చిమబెంగాల్లో మమత కోటను బద్దలు కొట్టిన బీజేపీ.. బెంగాల్ ముఖ్యమంత్రి అతనేనా?
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించగా.. సరిగ్గా ఇదే రోజు త్రిష పుట్టిన రోజు కావడం విశేషం. ఈ క్రమంలో ఆమె సోమవారం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి.. ముఖ్యంగా గత ఏడాది కాలం నుంచి త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డీఎంకే పార్టీకి చెందిన పలువురు నేతలుసైతం విజయ్ను టార్గెట్గా విమర్శలు చేస్తూ త్రిష పేరును ప్రస్తావిస్తూ వచ్చారు. విజయ్, త్రిషల మధ్య ఏదో నడుస్తోందని, వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా టాక్ నడుస్తూనే ఉంది. విజయ్, తన భార్య మధ్య విబేధాలు నడుస్తున్న విషయం తెలిసిందే. త్వరలో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారని సమాచారం.
విజయ్ టీవీకే పార్టీ విజయంలో త్రిష పాత్ర కూడా ఉందంటూ తమిళ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ బలోపేతానికి త్రిష్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. డీఎంకే పార్టీకి చెందిన పలువురు నేతలు విజయ్, త్రిష పేర్లను ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం కూడా టీవీకే పార్టీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే అధికారంలోకి రాబోతుండటంతో.. కొత్తగా ఏర్పాటయ్యే విజయ్ ప్రభుత్వంలో త్రిషకు కీలక పదవి ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Also Read : ప్రశాంత్ కిశోర్ చెప్పిన జోస్యం నిజమైంది.. తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తున్న విజయ్ పార్టీ
గతంలో త్రిష మాట్లాడుతూ.. నేను తమిళనాడుకు సీఎం అవుతానని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను పోస్టు చేస్తూ కొందరు నెటిజన్లు త్రిషకు కంగ్రాట్స్ చెబుతుండటం గమనార్హం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం ఖాయం కావడంతో.. విజయ్ త్రిషకు ఏ పదవి ఇస్తారనే అంశంపైనా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, విజయ్ ప్రభుత్వంలో ఆమె పాత్ర ఏమిటి? పదవి తీసుకుంటుందా? పార్టీలో అధికారికంగా ఏదైనా పదవి తీసుకుంటుందా..? విజయ్ త్రిషకు ఎలాంటి సర్ ఫ్రైజ్ ఇవ్వబోతున్నారు..? అనే అంశాలపై ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
