Tamilnadu election result 2026 : ప్రశాంత్ కిశోర్ చెప్పిన జోస్యం నిజమైంది.. తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తున్న విజయ్ పార్టీ
Tamilnadu election result 2026 : తమిళనాడు రాజకీయాల్లో సచలనం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది.
Vijay party Prashant Kishor
Tamilnadu election result 2026 : తమిళనాడు రాజకీయాల్లో సచలనం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ టీవీకే పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం వైపు దూసుకెళ్తున్నారు.
Also Read : Tamilnadu Election Result 2026 : తమిళనాడులో విజయ్ హవా.. సీఎం అతనేనా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు..
తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234స్థానాలకుగాను 100కుపైగా స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118కాగా.. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సమయానికి టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫలితాలను బట్టి చూస్తుంటే తమిళనాడులో విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గతంలో చెప్పిన జోస్యం నిజమైందన్న చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమిళ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ‘మీరు రాసిపెట్టుకోండి. మళ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో ప్లే చేయండి. విజయ్ సింగిల్ గా వెళ్తాడు. కచ్చితంగా 118 సీట్లు గెలుస్తాడు’ అని చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
visionary pic.twitter.com/HlHBGftl6y
— Sripaad R (@sripaad125) May 4, 2026
మాస్టర్ స్ట్రాటజిస్టుగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ బృందం తమిళనాడులో విజయ్ పార్టీకి పనిచేసింది. తమిళనాడులో టీవీకే గెలుపులో ప్రశాంత్ కిశోర్ టీం కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి నెలలో జరిగిన టీవీకే పార్టీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధోనీ సీఎస్కే ని గెలిపించినట్లు నేను టీవీకేని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ చేశారు. విజయ్ పార్టీని గెలిపిస్తే ధోనీ కన్నా తనకే పాపులారిటీ తమిళనాడులో వస్తుందని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. తమిళం నేర్చుకుని వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల తరువాత విజయ్ పార్టీ విజయోత్సవంలో తమిళంలో మాట్లాడతానని ప్రకటించారు. విజయ్‌తో మాట్లాడినప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి నిబద్ధతతో ఉన్నాడని పీకే చెప్పారు. అయితే, ప్రస్తుతం పీకే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీకే చెప్పిన జోస్యం నిజమైందంటూ టీవీకే అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
Prashant Kishor joins actorvijay
for the TVK anniversary celebrations in Chennai… Kishor is clearly going to be Vijay’s political advisor#tvk #vijay #prashantkishore #aadhhav @AdvocateVenkatP pic.twitter.com/2yybeIfupQ— Suresh Elangovan (@sureshelangov12) February 26, 2025
