×
Ad

Twitter appoints: సెంట్రల్ గవర్నమెంట్‌కు తలొగ్గిన ట్విట్టర్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను ఒప్పుకుంది. టెంపరరీ చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు, ఆ అధికారి వివరాలను త్వరలోనే ఐటీ మంత్రిత్వ శాఖతో షేర్ చేసుకుంటామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.

Twitter (1)

Twitter appoints: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను ఒప్పుకుంది. టెంపరరీ చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు, ఆ అధికారి వివరాలను త్వరలోనే ఐటీ మంత్రిత్వ శాఖతో షేర్ చేసుకుంటామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలను తక్షణమే పాటించడానికి చివరి అవకాశమిస్తూ.. ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసింది.

ఈ సారి నిబంధనలను పాటించడంలో విఫలమైతే ఐటీ చట్ట ప్రకారం గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది కేంద్రం. చివరి హెచ్చరికను అనుసరించి, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్ నియామకాన్ని ఖరారు చేసే దశలో ఉందని, వారంలోపు మిగిలిన వివరాలను సమర్పించనున్నట్లు ట్విట్టర్ గత వారం ఇండియన్ గవర్నమెంట్ కు హామీ ఇచ్చింది.

కొత్త గైడ్ లైన్స్‌కు అనుగుణంగా కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని ట్విట్టర్ ప్రతినిధి మంగళవారం చెప్పారు. తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించామని, త్వరలోనే వివరాలను మంత్రిత్వ శాఖతో పంచుకుంటామని ప్రతినిధి తెలిపారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఐటి నిబంధనలను పాటించడంలో ఆలస్యం కావడంతో ట్విట్టర్ తీసుకున్న చర్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.