Religious Conversion: పాకిస్తాన్ నిధులతో చిన్నారులను మూగ, చెవిటిగా మారుస్తున్న ఇద్దరు అరెస్టు

మతమార్పిడులతో పాటు చిన్నారులను మూగ, చెవిటిగా మారుస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఇద్దరు వ్యక్తులు పేద కుటుంబాలను...

Uttarpradesh

Religious Conversion: మతమార్పిడులతో పాటు చిన్నారులను మూగ, చెవిటిగా మారుస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఇద్దరు వ్యక్తులు పేద కుటుంబాలను, దివ్యాంగులకు టార్గెట్ చేసుకునేవారు. ప్రత్యేకించి దివ్యాంగులను మతం మారాలంటూ ప్రేరేపించేవారు. వారిద్దరినీ ఉమర్ గౌతమ్, మఫ్టీ ఖాజీ జహంగీర్ గా గుర్తించారు.

ఢిల్లీలోని జామియా నగర్ లో వారిద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్)మాట్లాడుతూ.. మతమార్పిడి రాకెట్ జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా వీరికి ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నాయని వెల్లడించారు. ఇంటరాగేషన్ లో వారిద్దరూ నోరు విప్పి సంవత్సరానికి 250 నుంచి 300 మందిని మారుస్తున్నట్లుగా చెప్పారు.

ఆర్థికంగా వెనుకబడిన మహళలను, పిల్లలను, దివ్యాంగులను ఎంచుకునేవాళ్లని చెప్పారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం మతమార్పిడులకు ఒప్పుకునేవారని అన్నారు. కొన్నిసార్లు మతాలు మార్పించి పెళ్లిళ్లు కూడా జరిపించేవారని విచారణలో తేలింది.

ఇస్లామిక్ దావా సెంటర్ అనే సంస్థను నడిపిస్తున్న వీరికి ప్రపంచవ్యాప్తంగా నిధులు వస్తున్నాయి. ఈ రాకెట్ లో ఉన్న మిగతా వ్యక్తులను బయటపెట్టే పనిలో పడ్డారు పోలీసులు.