Road Accident : ఉత్తరప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.....
- saleem sk
- Published On : October 5, 2023 / 05:54 AM IST
Road Accident
Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి ప్రయాణికులతో నిండిన బస్సు బీహార్‌లోని మధుబనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు అయోధ్యకు చేరుకోగానే కొత్వాలి నగర్‌లోని ఓవర్ బ్రిడ్జి వద్ద బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది.
CM Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. ముఖ్యమంత్రి హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే పోలీసు అధికారులు, ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని అయోధ్య సిటీ ఎస్పీ మధుబన్ సింగ్ చెప్పారు. క్షతగాత్రులు అయోధ్య జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Balakrishna : చంద్రబాబు అరెస్ట్.. జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని లక్నో ఆసుపత్రికి పంపించారు. మృతులు బీహార్‌లోని మధుబని, సుపాల్‌కు చెందినవారు. ఆరుగురు ప్రయాణికులను దర్శన్ నగర్ మెడికల్ కాలేజీలో, ఇద్దరు ప్రయాణికులను అయోధ్య జిల్లా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. సీనియర్ అధికారులు ఘటనా స్థలాన్ని, జిల్లా ఆసుపత్రి ట్రామా సెంటర్‌ను పరిశీలించారు.
