Balakrishna : చంద్రబాబు అరెస్ట్.. జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. Balakrishna

Balakrishna : చంద్రబాబు అరెస్ట్.. జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Balakrishna On Jr Ntr Silence

Updated On : October 4, 2023 / 11:34 PM IST

Balakrishna – Jr NTR : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పలువురు ప్రముఖులు సైతం స్పందించారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సైతం చంద్రబాబు అరెస్ట్ పై తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు కరెక్ట్ కాదన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు మంచిది కాదన్నారు. త్వరలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇంతవరకు ఈ ఇష్యూపై జూనియర్ ఎన్టీఆర్ అస్సలు స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ మౌనం హాట్ టాపిక్ గా మారింది. జూ.ఎన్టీఆర్ సైలెన్స్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

Also Read..Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా వాళ్లు స్పందించకపోయినా నేను పట్టించుకోను, జూ.ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ అని బాలయ్య తేల్చి చెప్పారు. ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ అనడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కేంద్రం పాత్ర ఉందా? లేదా? తెలియదని.. అనవసరంగా తాము ఎవరిపైనా నిందలు వేయమని బాలకృష్ణ అన్నారు.

Also Read.. Roja Selvamani : మంత్రి రోజా కంటతడి.. ఈ పరిస్థితి రేపు లోకేశ్ భార్యకూ వస్తుందని సీరియస్ వార్నింగ్

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఐ డోంట్ కేర్ అని ఠక్కున సమాధానం చెప్పారు బాలకృష్ణ.