Security breach in Lok Sabha: పార్లమెంట్ దాడికి నెల నుంచి ప్రణాళిక.. నిందితులపై ఉపా కేసు

లోక్‌సభ సభ లోపల ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి క్రిందికి దూకి కలర్ గ్యాసులను ప్రయోగించారు. దీంతో లోక్ సభలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి గందరగోళం ఏర్పడింది

దేశంలోని పాత పార్లమెంట్‌పై 13 డిసెంబర్ 2001న ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, దాన్ని చూసి అందరూ చలించిపోయారు. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత, అంటే 13 డిసెంబర్ 2023న పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా, ఇద్దరు వ్యక్తులు ప్రజాస్వామ్య దేవాలయం భద్రతను ధిక్కరించి లోక్‌సభలోకి ప్రవేశించారు. సరిగ్గా అదే తేదీని కొత్త పార్లమెంట్ మీద జరిగిన దాడి ఇది. దీని కోసం నెల రోజుల నుంచి ప్తాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.

లోక్‌సభ సభ లోపల ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి క్రిందికి దూకి కలర్ గ్యాసులను ప్రయోగించారు. దీంతో లోక్ సభలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి గందరగోళం ఏర్పడింది. ఈ పొగ దాడి పార్లమెంటు లోపల మాత్రమే కాదు, పార్లమెంటు బయట కూడా జరిగింది. బయట మరో ఇద్దరు వ్యక్తులు ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. వారిలో ఒక మహిళ. అనంతరం నలుగురిని అరెస్టు చేశారు. ఈ దాడిలో ఎంపీలు ఎవరూ గాయపడనప్పటికీ, భద్రతకు సంబంధించి ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. కాగా, నిందితులపై ఉపా కేసు నమోదు చేశారు.